జనవరి 26 నుంచి మూడు
పథకాల అమలు రైతు భరోసాను
ఎకరానికి ఏడాదికి రూ.12వేలకు
పెంచుతూ కేబినెట్ నిర్ణయం
భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
పేరిట కొత్త పథకం
ఏటా రూ. 12వేలు ఆర్థిక సాయం
వ్యవసాయ యోగ్యమైన
భూములన్నింటికీ రైతు భరోసా
సాగులో లేని భూములకు భరోసా
ఇవ్వం రెవెన్యూ అధికారుల సర్వేలో
సాగు భూముల నిర్ధారణ
గ్రామసభల్లో ఆమోదం పొందిన
భూములకే భరోసా 26 నుంచి కొత్త
రేషన్‌కార్డులు ప్రభుత్వ ఆదాయం
పెంచడం..పేదలకు పంచడం మా
విధానం వ్యవసాయాన్ని పండుగ
చేయాలనే లక్షంతోనే రైతు భరోసాను
రూ.12వేలకు పెంచాం మీడియా
సమావేశంలో కేబినెట్ నిర్ణయాలను
వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భ రోసా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందని అలాగే భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథ కం’ కింద ఏటా రూ.12 వేలు సాయం అందించాలని మంత్రి మండలి నిర్ణయించిందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వీ టితో పాటు పేదలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని సి ఎం తెలిపారు. ఈ నెల 26 నుంచి రైతుభరోసా, ఇందిరమ్మ ఆ త్మీయ భరోసా, రేషన్ కార్డుల పంపిణీ జరుగనుందని ఆయన తెలిపారు. కేబినెట్ తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలకు సం బంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడు తూ రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కా ర్డులకు సంబంధించి కేబినెట్ భేటీలో చర్చించామన్నారు. వ్య వసాయ యోగ్యమైన భూమికి గత ప్రభుత్వం ఎకరాకు రూ. 10వేలు ఇస్తే ప్రస్తుతం రైతులందరికి ఎకరానికి రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. దీంతోపాటు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు రూ.12వేలు, రేషన్ కార్డులు లేని అర్హులందరికీ కార్డులు అం దించాలని నిర్ణయించామని ఈ మూడు అంశాలు జనవరి 26 వ తేదీ నుంచి అమలవుతాయని సిఎం తెలిపారు.
డా.బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని 26వ తేదీనే అమలు చేశారని అందులో భాగంగానే తాము ఈ మూడింటిని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు. రైతులకు మేలు చేయాలన్న అందించాలన్న ఉద్ధేశ్యంతో ఈ అంశాలను అమలు చేయనున్నట్టు ఆయన తెలిపారు. వ్యవసాయా న్ని పండుగ చేయాలన్న ఉద్ధేశ్యంతో తాము ఈ నిర్ణయాన్ని అ మలు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రైతులు గందరగోళపడకుండా ప్రభుత్వం నిర్ణయాలు తాను వెల్లడిస్తున్నానని ఆయ న తెలిపారు. వ్యవసాయానికి అనుకూలమైన భూములకే రైతుభరోసా పథకాన్ని వర్తింప చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపా రు. రాళ్లు, రప్పలు, రియల్ వెంచర్‌లుగా మారిన భూముల కు, నాలా కన్వర్షన్ అయిన వాటికి, సాగుకు అనుకూలంగా లేని భూములకు ఈ పథకం వర్తించదని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి వాటిని గ్రామసభల్లో పెడతారని ఆయా భూములకు గ్రామసభలు ఆమోదింప చేసుకున్న తరువాత వాటికి రైతుభరోసా ప థకాన్ని అమలు చేస్తామని సిఎం తెలిపారు.
ఆదాయాన్ని పెం చాలి, పేదలకు పంచాలన్నదే తమ ఉద్ధేశ్యమని సిఎం పేర్కొన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినె ట్ సమావేశం మూడుగంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అందులో భాగం గా కేబినెట్ పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలిసింది. ఈ అజెండాలో 22 అంశాలు ఉండగా అందులో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలకు ఆమోదముద్ర వే యగా, రేషన్ కార్డుల జారీని ఈనెల 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. వీటితో పాటు ఇందిరమ్మ ఇళ్లు, బిసి రిజర్వేషన్లు, నూతన మండలాల ఏర్పాటు, సన్న బియ్యం – ఎప్పటి నుంచి ఇవ్వాలన్న అంశాలపై కూడా కేబినెట్ చర్చించినట్టుగా సమాచారం. అంతేకాకుండా పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని, సింగూరు ప్రాజెక్టుకు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి, దివంగత మంత్రి రాజనర్సింహ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీ 2 వ్యయం రూ.1,784 కోట్లకు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇక, పాలమూరు -రంగారెడ్డిలో భాగంగా ఎదుల-డిండికి రూ.1800 కోట్ల అంచనా వ్యయానికి, మరోవైపు పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో 588 కారుణ్య నియామకాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 56 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేయాలని, తెలంగాణ టూరిజం పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపినట్టుగా సమాచారం. ఫిబ్రవరి నుంచి సన్నబియ్యాన్ని కూడా పంపిణీ చేయాలని కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. జూరాల జలాలతో మహబూబ్ నగర్ జిల్లాలో కొత్తగా మరింత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న మార్గాలు, ప్రత్యేమ్నాయాలను పరిశీలించేందుకు టెక్నీకల్ ఎక్స్పర్ట్ కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. ఎక్కడ నీటి లభ్యత ఉంది..? ఎక్కడ నుంచి ఎంత నీటిని తీసుకునే వీలుంది..? ఎక్కడెక్కడ రిజర్వాయర్లు నిర్మించాలి..? ఇప్పుడున్న ప్రాజెక్టులకు మరింత నీటిని తీసుకునే సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేస్తుంది. మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ తాగునీటికి తరలించే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2, ఫేజ్-3 కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 15టీఎంసీలకు ప్రతిపాదించిన ఈ పథకాన్ని భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు ఆమోదం తెలిపింది.కొత్తగూడెంను మున్సిపల్ కార్పొరేషన్‌గా, ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసేందుకు కేబినేట్ ఆమోద ముద్ర వేసింది.