Friday, December 20, 2024

మెట్రో రెండోదశ భూసేకరణకు గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

ఎంజిబిఎస్ నుంచి
చాంద్రాయణగుట్ట వరకు
200 ఆస్తులకు
సంబంధించిన డిక్లరేషన్
హైదరాబాద్ పాతబస్తీలో
మొదలుకానున్న
మెట్రోరైలు పనులు
జనవరిలో ముహూర్తం

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 భూ సేకరణకు ప్రభుత్వం గ్రీన్ సి గ్నల్ ఇచ్చింది. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి -చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న 7.5కి లోమీటర్ల మెట్రో రైలు మార్గానికి కావాల్సిన భూ సేకరణ డిక్లరేషన్ కు హైదరాబాద్ కలెక్టర్ అనుదీ ప్ దురిషెట్టి శనివారం ఆమోదం తెలిపారు. దీంతో హైదరాబాద్ పాతనగరంలో మెట్రో రైలు పనులు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ మెట్రో సంస్థ ఇప్పటికే భూసేకరణ కోసం నోటీసులు ఇచ్చింది. ఈ రూట్లో రోడ్డు విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి కీలకంగా మారిన ఆస్తుల సేకరణ చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన మెట్రో ఫేజ్ 2 కారిడార్ ఎంజిబిఎస్ నుంచి చంద్రాయణ్ గుట్ట మార్గంలో 200 ఆస్తులకు సంబంధించిన డిక్లరేషన్ ఆమోదించారు.

కొత్త సంవత్సరం జనవరిలో మెట్రో రైలు పనులు ప్రారంభం కానున్నాయి. మెట్రో రెండో దశ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం రూ. 24,269 కోట్లు. అందులో 30 శాతం అంటే రూ.7,313 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, 18 శాతం అంటే రూ. 4,230 కోట్లు కేంద్ర ప్రభుత్వం వెచ్చించనుంది. 52 శాతం నిధులను రుణాలతో పాటు పిపిపి విధానంలో సమకూర్చుకునేలా ప్రభుత్వం డిపిఆర్ సిద్ధం చేసి ఆమోదం తెలిపింది. రెండో దశలో ప్రభుత్వం ఐదు కొత్త కారిడార్లు ప్రతిపాదించింది. నాలుగో కారిడార్ నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు (36.8 కి.మీ), ఐదో కారిడార్ రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపొలిస్ వరకు (11.6 కి.మీ), ఆరో కారిడార్ ఎంజిబిఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట వరకు (7.5 కి.మీ), ఏడో కారిడార్ మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు (13.4 కి.మీ), ఎనిమిదో కారిడార్ ఎల్‌బినగర్ నుంచి హయత్ నగర్ వరకు (7.1 కి.మీ.). ప్రస్తుతం మెట్రోలో రోజుకు దాదాపు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రెండో దశ మెట్రో రైల్ అందుబాటులోకి వస్తే సిటీలో రోజుకు మరో 8 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News