Wednesday, January 22, 2025

ఎన్‌ఐసి చేతికి ధరణి

- Advertisement -
- Advertisement -

ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతల ను ఎన్‌ఐసికి (నేషనల్ ఇన్‌ఫ్రాటిక్ సెంటర్‌కు) అప్పగిస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. డి సెంబర్ ఒకటో తేదీ నుంచి ఎన్‌ఐ సి ఈ బాధ్యతలు చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. ఇప్పటివరకు టె రాసిస్ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తు న్న ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇ న్ఫర్మేటిక్ సెంటర్- (ఎన్‌ఐసికి) రాష్ట్ర ప్రభుత్వం అ ప్పగించినట్టయ్యింది. మూడేళ్ల పాటు ధరణి పోర్ట ల్ నిర్వహణకు సంబంధించి ఎన్‌ఐసితో ఒప్పం దం చేసుకున్నట్లు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో పే ర్కొంది. ఎన్‌ఐసి పనితీరు బాగుంటే మరో రెండే ళ్లు నిర్వహణ బాధ్యతలను పొడిగించనున్నట్లు ప్ర భుత్వం ఈ ఉత్తర్వుల్లో తెలిపింది.

టెరాసిస్ నుంచి ఎన్‌ఐసికి ఈ బాధ్యతలను అప్పగించడం ద్వారా దాదాపు కోటి రూపాయల ని ర్వహణ భారం తగ్గుతుందని రె వెన్యూ అధికారులు వెల్లడించా రు. అయితే ధరణి పోర్టల్‌కు సంబంధించి సాంకేతిక అంశాలను పూర్తిస్థాయిలో ఎన్‌ఐసికి బదలాయించేందుకు నవంబర్ 30వ తేదీ వరకు ప్రభుత్వం గ డువు విధించింది. అయితే టె ర్రాసిస్ నుంచి ఎన్‌ఐసీకి డేటా, మెయింటెనెన్స్ వర్క్ ట్రాన్ష్‌ఫర్ చేసేందుకు ఒక నెల గడువు ఇచ్చింది. ఎన్‌ఐసీకి డేటా ట్రాన్ష్‌ఫర్ చేసేందుకు టెరాసిస్ సంస్థ సిబ్బంది ఎన్‌ఐసికి సహకరించాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటర్ నవీన్ మిట్టల్ ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

2018లో ఐఎల్‌ఎఫ్‌ఎస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (టెర్రాసిస్)కు బాధ్యతలు
2018 మార్చి 29వ తేదీన జీఓ 65 ద్వారా అప్పటి ప్రభుత్వం ఐఎల్‌ఎఫ్‌ఎస్ టెక్నాలజీస్ లిమిటెడ్ (టెర్రాసిస్)కు ధరణి బాధ్యతలను అప్పగించారు. ఈ మధ్య కాలంలోనే ఐఎల్‌ఎఫ్‌ఎస్ నుంచి టెర్రాసిస్‌గా రూపాంతరం చెందింది. ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఐటీఈసీ, టిజిటిఎస్ వెబ్ సైట్‌ల బాధ్యతలను టెర్రాసిస్ చేపట్టింది. తొలుత 2018 ఏప్రిల్ 20 నుంచి ధరణి పోర్టల్‌ను రూపొందించడంతో తదితర బాధ్యతలను ఈ సంస్థ చేపట్టింది. ఆ తర్వాత 2020 అక్టోబర్ 29వ తేదీ నుంచి 2023 అక్టోబర్ 29వ తేదీ వరకు మూడేండ్ల పాటు ఆ సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారు. గతేడాది కాలపరిమితి ముగిసినా మరో ఏడాది పాటు అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టును పొడిగించింది. ఈ నెల 29వ తేదీన టెర్రాసిస్ కాలపరిమితి ముగుస్తుండడంతో

ధరణి బాధ్యతలు ఏ కంపెనీకి అప్పగించాలన్న దానిపై ధరణి కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఇందులో భాగంగా ధరణి కమిటీ ఎన్‌ఐసీ, సీజీజీ, టిజి ఆన్‌లైన్‌ల పనితీరును పరిశీలించింది. ఆఖరికు ఎన్‌ఐసికి ఈ బాధ్యతలను అప్పగించాలని ధరణి కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. ల్యాండ్ రికార్డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాంలో ఎన్‌ఐసీకి సుదీర్ఘ అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మూడేళ్ల పాటు ఈ బాధ్యతలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 25వ తేదీన ధరణి ప్రాజెక్టును ఎన్‌ఐసికి అప్పగించే అంశంపై రెవెన్యూ అధికారులు, ధరణి కమిటీ సభ్యులు, టిజిటిఎస్, ఎన్‌ఐసీ, టెర్రాసిస్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులు సమావేశం కానున్నారు.

ధరణి స్థానంలో భూమాత
మరోవైపు ధరణి పోర్టల్ స్థానంలో భూ మాత పేరుతో పోర్టల్ ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ధరణి పోర్టల్‌కు సంబంధించిన బాధ్యతలను టెర్రాసిస్ సంస్థ నుంచి ప్రభుత్వం ఎన్‌ఐసీకి బదలాయింపు చేయడం, ఇక ధరణి పేరు స్థానంలో భూమాతగా పేరు మార్పు చేస్తే ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తవుతుందని రెవెన్యూ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News