హైదరాబాద్ ః తెలంగాణ ప్రభుత్వం వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ దేశ ఆర్థిక రంగం అభివృద్ధికి తోడ్పడుతున్న వ్యాపారవేత్తలకు సరళతరమైన విధానాలు అమలు చేస్తుందని యువ పారిశ్రామిక వేత్త ధనుష్ పేర్కొన్నారు. ఇటీవల ఇండియా ఆఫ్రికా ట్రేడ్ కౌన్సిల్ చైర్మన్ గా, ఈతోఫియా ట్రేడ్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నగరానికి చెందిన యువ వ్యాపారవేత్త బొల్లినేని ధనుష్ యంగ్ ఇండియన్ అచీవర్ అవార్డును దుబాయ్ లో జరిగిన కార్యక్రమంలో అందుకున్నారు. అతి చిన్న వయసులో వ్యాపార రంగంలోకి ప్రవేశించి తనదైన శైలిలో ఆ రంగంలో అత్యంత ఉన్నత శిఖరాలకు అధిరోహించడంతో నిర్వాహకులు ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
అవార్డును అందుకోవడం తనకెంతో సంతోషంగా ఉందని అదే సమయంలో మరింత శ్రమించి వేలాది మందికి ఆదర్శంగా నిలవాలని కసి తనలో పెరిగిందని ధనుష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలు పాటించే పరిశ్రమిక వేత్తలకు, వ్యాపారవేత్తలకు సులభంగా లైసెన్స్ జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. వ్యాపార రంగంలో రాణించాలన్న ఆసక్తి ఉన్న వారికి ప్రభుత్వ సహాయంతోడైతే అద్భుతాలు సాధించి ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు.