Sunday, April 20, 2025

రూ. 10,500 కోట్లతో ఎఐ డేటా సెంటర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో ఏర్పాటు
చేయడానికి ముందుకు వచ్చిన
జపాన్ కంపెనీలు ఎన్‌టిటి
డేటా, నెయిసాలతో త్రైపాక్షిక
ఒప్పందం టోక్యోలో సిఎం
రేవంత్‌రెడ్డి సమక్షంలో
సంతకాలు భారీ పెట్టుబడుల
ఒప్పందంపై హర్షం వ్యక్తం
చేసిన సిఎం రాష్ట్ర విధానాలకు
ఆకర్షితులవుతున్న పెట్టుబడిదారులు
రూ. 562కోట్ల పెట్టుబడితో
రుద్రారంలో తోషిబా ఫ్యాక్టరీ
టోక్యో నుంచి
చాలా నేర్చుకున్నా
భారత్, జపాన్‌లు కలిసి
ప్రపంచానికి అద్భుతమైన
భవిష్యత్‌ను నిర్మించాలి
ఎకనామిక్ పార్టనర్‌షిప్
రోడ్ షోలో సిఎం రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : జపాన్‌లో తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. శుక్రవారం రూ.11,062 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి పలు కంపెనీలు ముందుకొచ్చాయి. అందులో భాగంగా హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఎన్టీటీ డేటా, నెయిసాలు సంయుక్తంగా రూ. 10,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాగా, రుద్రారంలో తోషి బా కొత్త ఫ్యాక్టరీ రూ.562 కోట్ల పెట్టుబడులు పె ట్టనున్నట్టు ప్రకటించింది. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేష న్, ఐటీ సర్వీసుల్లో ప్రపంచంలో పేరొందిన ఎన్టీటీ డేటా, అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఫస్ట్ క్లౌడ్ ప్లాట్ ఫాం సంస్థ నెయిసా నెట్‌వర్స్ సంయుక్తంగా హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్‌ను రూ. 10,500 కోట్లతో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి దాదాపు

రూ. 10,500 కోట్ల పెట్టుబడితో ఈ క్లస్టర్ ఏర్పా టు చేసేందుకు త్రైపాక్షిక ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నాయి. టోక్యోలో జరిగిన ఉన్నత స్థా యి సమావేశంలో ఈ పెట్టుబడుల ఒప్పందం కు దిరింది. సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఎన్టీటి డే టా, నెయిసా నెట్‌వర్క్ నుంచి బోర్డు సభ్యుడు కె న్ కట్సుయామా, డైరెక్టర్ తడావోకి నిషిమురా, ఎన్టీటి గ్లోబల్ డేటా సెంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ బజ్పాయ్, నెయిసా సీఈఓ, ఎన్టీటీ గ్లోబల్ డేటా చైర్మన్  షరద్ సంఘీ ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. దేశంలో అతిపెద్ద ఏఐ కంప్యూట్ మౌలిక సదుపాయం హైదరాబాద్‌ల్లో నిర్మించబోయే ఈ సదుపాయం 400 మెగావాట్ల డేటా సెంటర్ క్లస్టర్. 25,000 జీపియూలతో దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఏఐ సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను సమకూరుస్తుంది.

500 మెగావాట్ల వరకు గ్రిడ్, పునరుత్పాదక విద్యుత్ మిశ్రమంతో
దేశంలో తెలంగాణను అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మార్చాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. ఎన్టీటీ డేటా, నెయిసా కంపెనీలు సంయుక్తంగా ఏఐ-ఫస్ట్ సొల్యూషన్‌ను అభివృద్ధి చేసేందుకు ఈ క్లస్టర్ కొత్త ఆవిష్కరణల కేంద్రంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 500 మెగావాట్ల వరకు గ్రిడ్, పునరుత్పాదక విద్యుత్ మిశ్రమంతో ఈ క్లస్టర్ నిర్వహిస్తారు. లిక్విడ్ ఇమ్మర్షన్ వంటి అత్యాధునిక కూలింగ్ టెక్నాలజీలను అవలంబిస్తారు. ఈ ప్రాజెక్టును అత్యున్నత ఈఎస్జీ (ఎన్వీరాన్‌మెంటల్, సోషల్, గవర్నెన్స్) ప్రమాణాలతో అభివృద్ధి చేస్తారు. ఈ క్యాంపస్ తెలంగాణలోని విద్యా సంస్థల భాగస్వామ్యంతో ఏఐ ప్రతిభను పెంపొందిస్తుంది. రాష్ట్ర డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌కు దోహదం చేస్తుంది.

పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి
ఈ భారీ పెట్టుబడుల ఒప్పందంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని ఆయన అన్నారు. నమ్మకమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా, సింగిలో విండో అనుమతులను ప్రభుత్వం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. వీటితో పాటు రాష్ట్రంలో ప్రతిభావంతులైన నిపుణులు అందుబాటులో ఉండటంతో ఏఐ సంబంధిత డిజిటల్ సేవల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. ఎడబ్ల్యూఎస్, ఎస్టీటీ, టిల్మన్ హోల్డింగ్స్, సీటీఆర్‌ఎల్‌ఎస్ వంటి పెద్ద కంపెనీల డేటా సెంటర్ ప్రాజెక్టుల వరుసలో ఎన్టీటీ భారీ పెట్టుబడుల ఒప్పందంతో దేశంలో ప్రముఖ డేటా సెంటర్ హబ్ గా హైదరాబాద్ స్థానం మరింత బలపడిందని ఆయన అన్నారు.

50 కన్నా ఎక్కువ దేశాల్లో 1,93,000 వేల మంది ఉద్యోగులతో….
టోక్యోలో ప్రధాన కార్యాలయం కలిగిన ఎన్టీటి డేటా, ఐటీ సేవలు, డేటా సెంటర్లు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో పేరొందిన కంపెనీ. 50 కంటే ఎక్కువ దేశాల్లో 1,93,000 మంది ఉద్యోగులతో, ప్రపంచంలోని టాప్ 3 డేటా సెంటర్ ప్రొవైడర్లలో ఈ కంపెనీ ఒకటిగా నిలిచింది. పబ్లిక్ సర్వీసెస్, బిఎఫ్‌ఎస్‌ఐ, హెల్త్‌కేర్, మాన్యుఫాక్చరింగ్, టెలికాం వంటి రంగాలకు ఈ సంస్థ సేవలను అందిస్తుంది. నెయిసా నెట్ వర్క్ ఏఐ-ఫస్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫాం సంస్థ, నిర్దిష్ట ఏఐ కంప్యూట్ సొల్యూషన్‌ను అందించటంపై ఈ కంపెనీ దృష్టి సారిస్తుంది..

తెలంగాణలో రూ.562 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి తోషిబా అనుబంధ సంస్థ ఒప్పందం
ఇక, తెలంగాణలోని రుద్రారంలో తోషిబా కొత్త ఫ్యాక్టరీ రూ.562 కోట్ల పెట్టుబడులను పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ ఒప్పందం తోషిబా కార్పొరేషన్ యొక్క అనుబంధ సంస్థ టిటిడిఐ (ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా) తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకొచ్చింది. విద్యుత్ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వంతో ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సమీపంలోని రుద్రారంలో టిటిడిఐ సర్జ్ అరెస్టర్స్ తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. వీటితో పాటు పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్స్, గ్యాస్ ఇన్సులేటెడ్ స్విచ్గేర్ (జీఐఎస్) తయారీ సామర్థ్యాన్ని విస్తరించడానికి ఇప్పటికే అక్కడ ఉన్న ఫ్యాక్టరీలను అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్ ఏర్పాటులో భాగంగా ఈ కంపెనీ రూ. 562 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించే ఈ కొత్త ఫ్యాక్టరీ విద్యుత్ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుంది.

రుద్రారంలో మూడో ఫ్యాక్టరీ ఏర్పాటు
రుద్రారంలో ఇప్పటికే రెండు ఫ్యాక్టరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న టిటిడిఐ, ఈ కొత్త పెట్టుబడితో మూడో ఫ్యాక్టరీ నెలకొల్పనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని విస్తరించనుంది. టోక్యోలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో తోషిబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ హిరోషి కనెటా, రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్, టిటిడిఐ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హిరోషి ఫురుటా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఆర్థిక పరివర్తనలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని అన్నారు.

పరిశ్రమల భాగస్వామ్యాలు, వ్యూహాత్మక సహకారాలతో అన్ని రంగాల్లో ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులకు తోషిబా చేసుకున్న ఒప్పందం పారిశ్రామిక రంగంలో కొత్త ఉత్సాహామిస్తుందని ఆయన అన్నారు. టిటిడిఐ చైర్మన్ హిరోషి ఫురుటా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానాలు తమను ఆకట్టుకున్నాయన్నారు. కొత్త ఆవిష్కరణల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధత తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చుతున్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఉత్సాహంతో ఉన్నట్లు ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News