Thursday, December 26, 2024

ఖర్చులోనూ ఖతర్నాక్

- Advertisement -
- Advertisement -

Telangana govt is moving forward without hesitation in spending funds

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు 8నెలల్లోనే
రూ.1.01 లక్షల కోట్ల వ్యయం

మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బడ్జెట్‌లో కేటాయించిన పథకాలకే అధిక ప్రాధాన్యతనిచ్చిన తెలంగాణ

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలన్నీ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడేవి కావడం తో ఆదాయం ఎలా ఉన్నప్పటికీ నిధుల వ్యయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్క డా వెనుకంజవేయకుండా ముందుకు సాగుతోంది. కరోనా కష్టకాలంలోనూ దేశంలోని మెజారిటీ రాష్ట్రాలు అభివృ ద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల వ్యయాన్ని దాదాపుగా నిలిపివేయగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం బడ్జెట్‌లో కేటాయించిన పథకాలకు యథావిధిగా నిధులను ఖర్చు చేస్తూ వస్తోంది. 2021-22వ ఆర్థిక సంవత్సరం అభివృద్ధి, సం క్షేమ కార్యక్రమాలకు కేవలం ఎనిమిది నెలల వ్యవధిలోనే ఒక లక్షా ఒక వెయ్యి 442 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఖర్చు చేసింది.

ఇందు లో రెవెన్యూ వ్యయం కింద 81,883 కోట్లు ఖర్చు కాగా, క్యాపిటల్ (అభివృద్ధి) వ్యయం కింద19,559 కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేశారు. సంక్షేమం, విద్య, వైద్యం, ఇతర సామాజిక రంగాల కోసం 36,825 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. పరిపాలన, న్యాయపరమైన, ఇతర సాధారణ రంగాల కోసం 27,939 కోట్ల రూపాయలను ఆర్థికశాఖ ఖర్చు చేసింది. నీటిపారుదల, పరిశ్రమలు, ఐ.టి. తదితర అభివృద్ధి పథకాలకు ఏకంగా 36,669 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఖర్చు చేసింది. ఈ రంగాలకు అత్యధిక నిధులను ఖర్చు చేసిన రాష్ట్రాల్లో తెలంగాణకు నాలుగో స్థానం దక్కింది. కరోనా, లాక్‌డౌన్ తదితర ఇబ్బందులతో ప్రభుత్వ ఖజానాకు ఆశించిన మేరకు ఆదాయం రాకపోయినప్పటికీ పొదుపు, సమర్థవంతమైన ఆర్ధిక విధానాలతో నిధులను అభివృద్ధి, సంక్షేమ రంగాలకు భారీగా ఖర్చు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు, కేంద్ర ప్రభుత్వానికి సైతం ఆదర్శంగా నిలిచింది. కరోనా కష్ట కాలంలోనూ తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలనే సదుద్దేశ్యంతో రైతు బంధు పథకం కింద ఈ ఏడాది ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసింది.

దీంతో రైతు బంధ పథకం కింద ఇప్పటి వరకూ 50 వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించి చరిత్ర సృష్టించింది. అంతేగాక దళితబంధు పథకానికి ఇప్పటి వరకు వంద కోట్ల రూపాయలను విడుదల చేసిన ప్రభుత్వం మరో 170 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఇలా అభివృధ్ధి, సంక్షేమ కార్యక్రమాలకు భారీగా నిధులను వ్యయం చేస్తూనే ఉంది. మరికొన్ని పథకాలకు నిధుల కొరత ఉన్నప్పటికీ ఎఫ్.ఆర్.బి.ఎం. నిబంధనల మేరకు రుణాలను సేకరించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకో అప్పులు చేయడానికి వెనుకంజ ఆర్థికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు అంటున్నారు. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు సైతం అప్పులు చేస్తూనే ఉంటాయని, ప్రపంచంలో అప్పులు చేయని దేశమే లేదని, మన దేశంలోని 29 రాష్ట్రాల్లో మెజారిటీ రాష్ట్రాలు జి.ఎస్.డి.పి.లో గరిష్టంగా 48 శాతం వరకూ అప్పులు చేశాయి. తెలంగాణ రాష్ట్రం రిజర్వు లెక్కల ప్రకారం కేవలం 16.1 శాతమే అప్పులు చేసిందని, మరో 20 నుంచి 25 శాతం వరకూ అప్పులు చేసుకునే వెసులుబాటు ఉన్నా ఆ దిశగా ఆలోచన చేయడం లేదని అంటున్నారు.

కేవలం సొంత ఆదాయం, కేంద్రం రావాల్సిన పన్నుల వాటా నిధులపైనే ఆధారపడి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కెసిఆర్ మదిలో ఉన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సరిపడా నిధులు లేక కొన్నింటినీ ప్రకటించడం లేకుంటే కనీవినీ ఎరుగని పథకాలు అమలయ్యేవని సదరు అధికారులు చెబుతున్నారు. ఆర్థికపరమైన అంశాల్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, ప్రపంచంలో అప్పులు చేయని దేశం, రాష్ట్రం ఎక్కడా లేదనే విషయాన్ని గుర్తించాలని అంటున్నారు. ఆర్థ్ధిక నిర్వహణలో అన్ని రంగాల్లో బేషుగ్గా ఉన్నందునే ఎన్నో అంతర్జాతీయ ఆర్థ్ధిక సంస్థలు, జపాన్ బ్యాంకు, ప్రపంచబ్యాంకు వంటివి తెలంగాణకు అప్పులిచ్చేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. అంతేగాక ప్రపంచ మేటి పరిశ్రమలు, సంస్థలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, ఎందుకంటే రాష్ట్ర ఆర్థికశాఖలో నిర్వహణ భేషుగ్గా ఉండబట్టే ఇది సాధ్యమవుతోందని అధికారులు సగర్వంగా చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News