Wednesday, January 22, 2025

ఇంజనీరింగ్ నిరుద్యోగులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

Telangana govt Issues Orders to Fill 1663 Vacancies

కొత్తగా 1663 పోస్టుల భర్తీకి అనుమతులు
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ
ఇప్పటి వరకు 46,998 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు

హైదరాబాద్ : ఇంజినీరింగ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే 45,325 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా మరో 1,663 ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీస్, ఫారెస్టు, ఫైర్, జైళ్లు, రవాణా, ఎక్సైజ్, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమశాఖ, విద్య, ఆరోగ్య శాఖల్లో ఖాళీల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి పచ్చ జెండా ఊపింది. ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఇది సువర్ణావకాశం. ఇరిగేషన్, ఆర్ అండ్ బి శాఖల్లోని 1522 పోస్టుల భర్తీకి క్లియెరెన్స్ ఇచ్చింది.

ఇంజనీర్ ఇన్ చీఫ్, ఇరిగేషన్ ( అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్)లో 1238 పోస్టులు, ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఆర్ అండ్ బి, ఎన్‌హెచ్, అడ్మినిస్ట్రేషన్, ఆర్వోబీ/ ఆర్‌యూబీ ఎస్, హెచ్ వోడీ)లో 284 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. వీటితో పాటు డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అక్కౌంట్స్ హెచ్‌వోడీలో 53 , డెరెక్టర్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ (హెచ్‌వోడీ)లో 88 ఉద్యోగాల భర్తీకి అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం 46,998 పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చినట్లయింది. ఇప్పటికే ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతులు ఇచ్చే ప్రక్రియ కసరత్తును ఆర్థిక శాఖ అధికారులు ముమ్మరం చేశారు. మరి కొద్ది రోజుల్లో మిగిలిన ఖాళీల నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News