- Advertisement -
ఎల్ఆర్ఎస్(లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించిన లే అవుట్ లను మార్చి 31లోగా క్రమబద్దీకరణ చేసుకునే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది.
దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న లాండ్స్ తప్ప మిగతా భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ నిర్ణయంతో దాదాపు 20 లక్షల మంది దిగువ, మధ్యతరగతి దరఖాస్తుదారులకు లబ్ధి చేకూరనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
- Advertisement -