Wednesday, January 22, 2025

రోబోటిక్ ఆవిష్కరణల కేంద్రం!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఐటి, ఫార్మా రంగాల్లో అంతర్జాతీయంగా తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన స్పూర్తితో రోబోటిక్స్‌లో కూడా అంతర్జాతీయ కీర్తిని సముపార్జించుకోవాలనే లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందుకు అనుగుణంగా ఐటి రంగంలో, రోబోటిక్స్ రంగంలో నిపుణులతో ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు పలువురు నిపుణులతో చర్చలు జరిపినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి.ఇప్పటికే రోబోటిక్స్ వినియోగం, ఫార్మా, అగ్రికల్చర్, పారిశ్రామిక రం గాల్లో అత్యధికంగా వినియోగిస్తున్నారు.

రాష్ట్రంలో రో బోటిక్స్‌పై పని చేస్తున్న సంస్థలు 1200 నుంచి 1500 వరకు ఉన్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి ప్రస్తుతం ఈ రంగంలో నిపుణుల సంఖ్య తక్కువగా ఉండమే కా కుండా ఇక్కడ ఉన్న సంస్థలు నిర్వహిస్తున్న వారికి అంతర్జాతీయ సంస్థలో అనుబంధం కూడా తక్కువ ఉండటం తో పాటు మార్కెటింగ్‌తో పాటు సాంకేతిక సహకారం కూడా అంతం మాత్రంగానే అందుతోంది. ఇటువంటి సమస్యలను పరిష్కరించేందుకు టి హబ్ తరహలో రోబోటెక్స్‌కూడా కేంద్రీకృత వ్యవస్థ అవసరం అని ప్రభుత్వం భావిస్తోంది.అందులో భాగంగానే తెలంగాణ రోబోటిక్స్ ఇన్నోవేషన్ సెంటర్ (ట్రిక్) ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా తెలంగాణ రోబోటిక్ ఇన్నోవేషన్ సెంటర్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆవిష్కరణల నుంచి మార్కెటింగ్ వరకు అనుసంధాన కర్తలా వ్యవహరించే విధంగా ఈ సంస్థను తీర్చిదిద్ద నుంది.

ఈ వ్యూహంలో భాగంగానే టి-. హబ్, డబ్లూ ఇహబ్, టి వర్క్, టాస్క్, టిఎస్‌ఐసి, ఆర్‌ఇసి, ఇతర ఈ అనేక విభాగాలను రోబోటిక్స్‌లో భాగస్వామ్యం చేయనుంది. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం టి హబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రోబోటిక్స్ ఫ్రేమ్ వర్క్ ఆవిష్కరణ జరిగింది. ఈ మేరకు ప్రజలు జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావితం చేసే, వ్యసాయం, ఆరోగ్య సంరక్షణ, పారిశ్రామిక ఆటోమిషన్, వినియోగదారు రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. రోబోటిక్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్న దేశాల్లో భారత్‌ది పదో స్థానం. ఈ రంగంలో మనకు అధికంగా అవకాశాలు ఉన్నాయి. 2021ప్రపంచ వ్యాప్తంగా 5,17385 రోబోలను అమర్చగా వాటిలో మన దేశంలో 4900 మాత్రమే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటి అవసరం క్రమంగా పెరుగుతోందని అందుకే రోబోల తయారీ రంగంలో నగరాన్ని గ్లోబల్ హబ్‌గా ఏర్పరచాలనేది ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. ఐటి రంగంలో ఇప్పటికే హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది ఉండటం కలిసి వచ్చే అవకాశం.

రోబోటిక్స్‌లో విద్యార్థులను ఆకర్షిచేందుకు విద్యా సంస్థ ల్లో రోబో ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వం, ప్రవేట్ విద్యాస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతో రోబోటిక్స్ టెక్ రీసెర్చ్ ప్రోగామ్‌తో పరిశోధనల ప్రోత్సహించేందుకు ప్ర భుత్వం సహకరిస్తుంది. జాతీయ, అంతర్జాతీయ విద్యా సంస్థల్లో నైపుణ్యాన్ని చూపుతున్న విద్యార్థులకు ఫెలోషిప్స్ అంద చేస్తుంది. రోబోటెక్స్ రీసెర్చ్, ఇన్నోవేషన్స్‌లో పనిచేసేందుకు ముందుకు వచ్చే తెలంగాణ విశ్వవిద్యాలయాలను, అంతర్జాతీయ విద్యా సంస్థలతో అనుసంధానం చేస్తుంది. ఈ మేరకు విద్యాసంస్థలను దశలవారీగా ఎంపిక చేస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News