Thursday, December 19, 2024

ఫార్మా, లైఫ్‌సైన్సెస్ రంగంలో రూ.32వేల కోట్ల పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/మాదాపూర్: రా ష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడి ఇంకా ఏడాది పూ ర్తి కాకుండానే లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో భా రీ పెట్టుబడులను ఆకర్షించి అద్భుత విజయాలు సాధించామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంపై మంత్రి మంగళవారం నాడు ఒక హో టల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పది నెలల కాలంలో రూ.35,820 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని తెలిపారు. 141 దేశీయ, బహుళ జాతి కంపెనీ లు ఔషధ, టీకాలు, లైఫ్ సైన్సెస్, పరిశోధన రం గాల్లో నిర్మాణాలు మొదలు పెట్టాయని తెలిపా రు. నిర్మాణాలు పూర్తి చేసుకుని ఉత్పాదన మొద లుపెట్టే దశల్లో మరికొన్ని ఉన్నాయని చెప్పారు. విస్తరణ పనులు చేపట్టిన కంపెనీలు ఉత్పాదన ప్రారంభించాయని వివరించారు. ఇవన్నీ పూర్తి అయితే 51,086 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని, మరో లక్షన్నర మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని మంత్రి వెల్లడించారు.

దేశంలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో కొత్త కంపెనీలకు హైదరాబాద్ కేంద్ర బిందువు అయ్యిందని తెలిపారు. రాష్ట్రంలో ఒకే చోట కాకుండా పలు ప్రాం తాల్లో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని చె ప్పారు. ఈ పరిశ్రమల్లో ఆధునిక కాలుష్య ని యంత్రణ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా అనుమతు లు ఇచ్చినప్పుడే నిబంధనలు విధించనున్నట్టు వివరించారు. ఏషియాలోనే మూడో అతి పెద్దదైన జపాన్‌కు చెందిన టకెడా లైఫ్ సైన్సెస్ సంస్థ స్థానిక బయోలాజికల్ ఇ (బిఇ)తో కలిసి ఏటా 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేస్తుందని మం త్రి శ్రీధర్ బాబు తెలిపారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేస్తుందని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద పశు వైద్య సంస్థ జోయెటిస్ ఇటీవలే జిసిసిని ప్రారంభించిందని తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద బయోటెక్నాలజీ కంపెనీ యా మ్ జెన్ 3,000 మందికి ఉద్యోగులను నియమించుకునే జిసిసిని ప్రారంభించిందని వివరించారు. జోయెటిస్, యామ్ జెన్ సంస్థలు సిఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఒప్పందాలు చేసుకుని అతి కొద్ది కాలంలోనే జిసిసి సెంటర్లను ఏర్పాటు చేసాయని ఆయన పేర్కొన్నారు.

రానున్న రెండు నెలల్లో లైఫ్ సైన్సెస్ కంపెనీలు నెలకొల్పేందుకు ముందుకొచ్చే సంస్థలకు భూ కేటాయింపులు, ప్రోత్సాహకాలకు సంబంధించిన కొత్త విధాన ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తారని శ్రీధర్ బాబు తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రం కూడా దీనికి సంబంధించిన ప్రత్యేక పాలసీని రూపొందించలేదని అన్నారు. ఫార్మా క్లస్టర్ల భూ సేకరణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి, వారు అంగీకరిచిన తర్వా తే పనులు చేపడతామని చెప్పారు. సమస్యలేమైనా ఉంటే రైతులు అధికారుల ముందు వెల్లడించాలని కోరారు. ప్రతిపక్షాల కుట్రలకు, రెచ్చగొట్టే చర్యలకు ప్రభుత్వం భయపడదని హెచ్చరించారు. పదేళ్ల కాలంలో తామెన్నడూ అధికారులపైన దాడులకు ఉసిగొల్పే కుట్రలకు పాల్పడలేదని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే ఏ శక్తినీ ఉపేక్షించబోమని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్, టీజీఐఐసి సిఇఓ మధుసూదన్ లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News