Tuesday, January 21, 2025

క్రీడల అభివృద్ధికి కృషి: శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

Telangana govt more concentrate on sports

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ఎంతో  కృషి చేస్తున్నామని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో క్వాలిఫైయర్ ఫర్ అమెచ్యూర్ ఒలంపియా 2022 ను నిర్వహిస్తున్న సందర్భంగా నిర్వాహకులు షఫీ సమిని అభినందించారు. హైదరాబాద్ నగరంలో  తొలిసారిగా మిస్టర్ తెలంగాణ షఫీ సమీ బాడీ బిల్డింగ్ మెన్స్ పిజిక్యూ చాంపియన్ షిప్-2022 నిర్వహిస్తున్నారు.  ఈ సందర్భంగా మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు.  ఇటీవల జరిగిన కామన్వెల్త్ లో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబర్చి దేశంలో పతకాలు సాధించడంలో రెండవ స్థానంలో నిలిచారని ప్రశంసించారు. హైదరాబాద్ నగరానికి క్రీడా హబ్ గా అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు లభిస్తుందన్నారు.హైదరాబాద్ లోని షేక్ పెట్ లోని ఎంఎస్ కన్వెన్షన్ లో అక్టోబర్ 2 న మిస్టర్ తెలంగాణ షఫీ సమీ బాడీ బిల్డింగ్ మెన్స్ పిజిక్యూ చాంపియన్ షిప్-2022 జరుగుతుందని నిర్వాహకులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు. ఈ కార్యక్రమంలో హల్ హజారి, అబ్దుల్లా, కాశీ విశ్వనాథ్ కట్ట తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News