Saturday, January 4, 2025

200 కొత్త పంచాయతీలు

- Advertisement -
- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వినతుల వెల్లువ గ్రామ పంచాయతీల ఎన్నికల నేపథ్యంలో సర్కార్ కసరత్తు
350 కనీస జనాభా నిబంధనను మార్చాలని ఒత్తిడి కొత్త, పాత గ్రామ పంచాయతీలకు కలిపి ఎన్నికలు?

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 200 గ్రామ పంచాయతీల ఏర్పాటుకు ప్రభు త్వం ఆలోచన చేస్తోంది. శాసనసభ ఎన్నికలకు ముందు ఆయా ప్రజాప్రతినిధులు స్థానికంగా ఇ చ్చిన హామీ మేరకు ఇప్పుడు ఒత్తిడి పెరుగుతోంది. కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాలని కోరు తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిల నుంచి పం చాయతీరాజ్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. తండా లు, గూడెంలు, పెద్ద గ్రామాలకు అనుబంధంగా ఉన్న కొన్ని ఆవాసాలను కొత్తగా పంచాయతీలుగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రచార స మయంలో ఆయా స్థానిక ప్రజల కోరిక మేరకు త ప్పకుండా పంచాయతీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు పంచాయతీ సమరానికి సమయం దగ్గర పడడంతో కొత్త పంచాయతీల ఏర్పాటు అంశం తెరమీదకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పం చాయతీరాజ్ చట్ట సవరణ చేసి పలు మార్పులు చేర్పులు చేసింది. కొన్నిచోట్ల పంచాయతీలను ము న్సిపాలిటీల్లో కలిపింది. మరికొన్ని మున్సిపాలిటీల ను నగర పాలక సంస్థలుగా మార్పు చేసింది. దీం తో పాటు చట్టంలో పలు నిబంధనలను కూడా స వరించింది.

పంచాయతీల్లో రిజర్వేషన్లు, ఎన్నికలు తదితర అంశాలను ప్రభుత్వం కొలిక్కి తెస్తోంది. ఇదే సమయంలో కొత్త పంచాయతీలను కూడా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను పరిష్కరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీల సంఖ్య పెరిగితే అందుకు అనుగుణంగా కేంద్ర నిధులు పెరుగుతాయని భావిస్తున్నారు. కొత్త పం చాయతీల ఏర్పాటుకు ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నర్ ఆమోదముద్ర వేసిన తర్వాత ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోన్న నేపథ్యంలో పాత పంచాయతీలతో పాటు కొత్తగా ఏర్పాటు అవుతున్న మరో 200 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా అధికారులు యోచిస్తున్నారు. కొత్త పంచాయతీల్లో వార్డులు, ఓటర్ల జాబితా కూడా సిద్ధం చేస్తున్నారు. తాజాగా 200 పంచాయతీలను ఏర్పాటు చేస్తే మొత్తం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల సంఖ్య 13,191కు పెరుగుతుంది. కాగా కొత్త పంచాయతీల ఏర్పాటుపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది.

కొత్తగా ఏర్పాటు చేయాలని కోరుతున్న గ్రామపంచాయతీల్లో అత్యధికంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు వంటి ఏజెన్సీ జిల్లాల్లోనే ఉన్నాయని సమాచారం. ఆయా జిల్లాల్లో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు కోసం ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల నుంచి పంచాయతీ రాజ్ శాఖకు విజ్ఞప్తులు రావడంతో ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. కొత్త గ్రామ పంచాయతీలపై ఎన్నికలకు ముందు హామీ ఇచ్చామని, ఎలాగైనా ఏర్పాటుచేసి తీరాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రభుత్వంపై డిమాండ్ చేస్తున్నారు. దీంతో అవసరమైన చోట్ల ఇప్పటికే ప్రతిపాదనలను తీసుకున్న పంచాయతీ రాజ్‌శాఖ పరిశీలన తర్వాత జనాభా దూరం తదితర పారామీటర్ల ఆధారంగా సుమారు 200 కొత్త పంచాయతీల ఏర్పాటు చేయాలనే ఆలోచనకు వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకు తక్కువ జనాభా ఉండడంతో చాలా ప్రతిపాదనలను తిరస్కరించి, ఆయా ప్రజాప్రతినిధులకు ఇప్పటికే సమాచారాన్ని ప్రభుత్వం అందించింది.

కనీస జనాభా 350 నిబంధన మార్చండి
ఒక గ్రామపంచాయతీ ఏర్పాటు చేయాలంటే కనీసం 350 మంది జనాభా ఉండానే నిబంధన కారణంగా ఇబ్బంది ఎదురవుతోంది. 350 జనాభా నిబంధన చాలా చోట్ల అడ్డంకిగా మారింది. ఈ కనీస జనాభా నిబంధనను మార్చయినా అన్నింటికీ ఒకే చెప్పాలని ప్రభుత్వంపై ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాము ప్రతిపాదించిన ఒక్క గ్రామాన్ని కూడా తొలగించవద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఏజెన్సీ ప్రాంతాలు ఆయా గ్రామ పంచాయతీలకు దూరంగా ఉండడం వల్ల పాలనాపరమైన సమస్యలు వస్తున్నాయి. అభివృద్ధి విషయంలో తమను నిర్లక్ష్యం చేస్తున్నారని గూడాలు, తండాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన అభ్యర్థుల ముందు ఇదే డిమాండ్ పెట్టారు. తాము అధికారంలోకి వస్తే గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని అభ్యర్థులు హామీ ఇచ్చారు. ఇప్పుడా హామీ నిలుపుకునే అవకాశం రావడంతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టారు. ఎన్నికలకు ముందే పంచాయతీలను ఏర్పాటు చేస్తే పార్టీకి కూడా కలిసి వస్తుందని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. గూడేలు, తండాలు, అనుబంధ గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజలకు దూరభారం కూడా తగ్గుతుంది. కేంద్ర, రాష్ట్రం నుంచి ప్రత్యేక నిధులు కూడా పెరిగి వల్ల అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News