Saturday, December 21, 2024

విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై హైకోర్టు విచారణ జరిగింది. గ్రూప్-1 పరీక్ష రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌లో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. ఎన్నిసార్లు నిర్లక్షం వహిస్తారంటూ తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వమే రూల్స్ ఉల్లంఘిస్తే ఎలా అంటూ మండిపడింది. ఒకసారి పేపర్ లీక్, ఇప్పుడేమో బయోమెట్రిక్ సమస్య అని మండిపడింది.  విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటం మాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే గ్రూప-1 ప్రిలిమ్స్ పరీక్షను రెండు సార్లు రద్దు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News