Thursday, December 26, 2024

అదానీ 100 కోట్లు తిరస్కరణ

- Advertisement -
- Advertisement -

అదానీ గ్రూప్‌నకు లేఖ రాశాం ఒప్పందాలపై న్యాయ నిపుణులను సంప్రదిస్తాం
అనవసర వివాదాల్లోకి ప్రభుత్వాన్ని లాగొద్దు రాష్ట్రంలో ఎవరికైనా వ్యాపారం
చేసుకునే హక్కు ఉంది రాజ్యాంగబద్ధంగానే పెట్టుబడులకు ఆహ్వానం
అదానీతో అంటకాగింది బిఆర్‌ఎస్సే ఆయనకు ఎన్నో ప్రాజెక్టులు కట్టబెట్టారు
జైలుకెళ్తే సిఎం కావొచ్చని కెటిఆర్ తహతహ.. అలాగైతే ముందువరుసలో కవిత
బిఆర్‌ఎస్‌లో సిఎం సీటు కోసం పోటాపోటీ నా ఢిల్లీ పర్యటనతో రాజకీయాలకు
సంబంధం లేదు, ఎన్నిసార్లయినా వెళ్తా వాళ్లలా పైరవీలు, బెయిళ్ల కోసం
వెళ్లట్లేదు మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై వివాదానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా రాష్ట్రంలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. సోమవారం జూబ్లీహిల్స్‌లో సిఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో విలేకరులతో మా ట్లాడుతూ అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు, ముఖ్యమంత్రి, మంత్రులకు ఇచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన రూ. 100 కోట్లు స్వీకరించకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. స్కి ల్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు బదిలీ చేయవద్దని అదానీ సంస్థకు ప్రభుత్వం తరఫున లేఖ రాశామని తెలిపారు. ముఖ్యమంత్రిగా తనకు, తమ మంత్రి వర్గానికి లేనిపోని వివాదాల్లో ఇరుక్కోవడం ఇష్టం లేదని అందుకే అదానీ గ్రూప్‌నకు వారి ని ధులు తీసుకోవడం లేదని లేఖ రాశామని అన్నారు.

రాష్ట్రంలో ని విద్యార్థులు, యువత అంతర్జాతీయస్థాయి స్కిల్స్ నేర్చుకోడానికి ముందుచూపుతో ఈ స్కిల్ యూనివర్సిటీని నెలకొల్పామని, దానికి సిఎస్‌ఆర్ నిధుల కింద ఏ కంపెనీ అయినా నిధు లు అందించవచ్చని ఆయన వెల్లడించారు. అదేవిధంగా అదా నీ ఇస్తే తీసుకున్నామని, అది మా ఇంట్లోకి ఇచ్చింది కాదని, రాష్ట్ర యువత కోసం ఇచ్చిందని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నా రు. కొన్ని రోజులుగా అదానీ అంశంపై తీవ్ర దుమారం రేగుతోందని సిఎం రేవంత్ గుర్తు చేశారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. అయితే చట్టబద్ధంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని ఆయన చెప్పారు. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అదానీ నుంచి పెట్టుబడులు స్వీకరించినట్లు సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగవద్దని ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అదానీకి ఎన్నో ప్రాజెక్టులు కట్టబెట్టిందని ఆయన గుర్తు చేశారు.

జైలుకు వెళ్లాలని కెటిఆర్
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నారని ఆయన అన్నారు. జైలుకెళ్తే సిఎం అవ్వొచ్చని కెటిఆర్ భావిస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కెసిఆర్ కుటుంబం నుంచి ఇప్పటికే కవిత జైలుకు వెళ్లారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. జైలుకెళ్లినవాళ్లు సిఎం అయితే ముందుగా ఆ పార్టీ నుంచి కల్వకుంట్ల కవిత అవుతుందని జోస్యం చెప్పారు. కెసిఆర్ కుటుంబంలో సిఎం సీటు కోసం పోటీ ఎక్కువగా ఉందన్నారు.

ఢిల్లీ టూర్‌పై క్లారిటీ..
తన తాజా ఢిల్లీ టూర్ పర్యటనపై సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమే ఈ ఢిల్లీ పర్యటన అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఢిల్లీ పర్యటనతో రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలపై మంగళవారం పార్టీ ఎంపిలతో చర్చిస్తామని ఆయన తెలిపారు. అందుబాటులో ఉన్న కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను వారికి వివరిస్తామని ఆయన తెలిపారు. మెట్రో రెండోదశ, నూతన విమానశ్రయాలకు అనుమతులు గురించి కేంద్రమంత్రులతో చర్చించనున్నట్టు సిఎం పేర్కొన్నారు. నేడు ఉదయం పలువురు కాంగ్రెస్ లోక్‌సభ, రాజ్యసభ ఎంపిలతో సమావేశమై రాష్ట్రానికి గతంలో రావాల్సిన నిధులు, అనుమతుల గురించి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రస్తావించాలని ఎంపిలను కోరతామని సిఎం తెలిపారు.

అవసరమైతే ఎన్నిసార్లు అయినా ఢిల్లీకి….
తాను 28 సార్లు ఢిల్లీ వెళ్లానని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి మాదిరిగా పైరవీలు చేయడానికి, బెయిల్ కోసం తాను ఢిల్లీ వెళ్లడం లేదని బిఆర్‌ఎస్ అగ్రనేతలను ఉద్దేశించి విమర్శించారు. వేరే వాళ్ల మాదిరిగా మోడీ కాళ్లు పట్టుకోవడానికో, కేసుల నుంచి తప్పించుకునేందుకో వెళ్లడం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులను రాబట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అవసరమైతే ఎన్నిసార్లు అయినా ఢిల్లీ వెళ్తామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

కెటిఆర్ కాదు… సైకో రాం….
సిఎం రేవంత్‌రెడ్డి కెటిఆర్‌కు కొత్త పేరు పెట్టారు. ఇక నుంచి ఆయన పేరు కెటిఆర్ కాదని సైకో రాం అని ఆయన అన్నారు. కెటిఆర్ పరిస్థితి కెటిఆర్‌కే తెలియదంటూ ముఖ్యమంత్రి మండిపడ్డారు. కెటిఆర్ పక్కన పని చేసే వాళ్లకే ఆయన చేష్టలు అర్ధ కావటం లేదని ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇక నుంచి కెటిఆర్‌ను సైకో రాం అని పిలుస్తామని, ఆయనకు సైకో రాం అనే పేరు కరెక్ట్ అంటూ రేవంత్ చురకలు అంటించారు. గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం కొన్ని మీడియా ఛానెల్స్‌పై నిషేధం విధించిన సంగతి గుర్తు లేదా అని రేవంత్ ప్రశ్నించారు. అధికారంలో ఉంటే ఒకలా ప్రతిపక్షంలో ఉంటే సైకోలా మాట్లాడుతున్నారని కెటిఆర్‌పై సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రతిదానికి ఓ విధానం ఉంటుందని అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు ఉంటాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కెటిఆర్ తలాతోక లేని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

బిఆర్‌ఎస్ చేసుకున్న ఒప్పందాలు చాలా ఉన్నాయి
బిఆర్‌ఎస్ కడుపు మంట తమకు తెలుసనీ, వారి కాకి గోల పట్టించుకోనని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ క్షోభ చూసి తమ కార్యకర్తల సంతోషంగా ఉన్నారన్నారు. బిఆర్‌ఎస్ చేసుకున్న ఒప్పందాలు చాలా ఉన్నాయని, అదానీతో కాంట్రాక్టులు, భూములు ఇచ్చింది వాళ్లు అని ఆయన ఆరోపించారు. అదానీ ఫ్లైట్‌లో తిరిగింది కూడా బిఆర్‌ఎస్ నాయకులు అని ఆయన అన్నారు. అప్పనంగా తాము ఏం ఇవ్వమని, గతంలో మీరు ఇచ్చిన హైవేలు, డేటా సెంటర్లు, మీరు కేటాయించిన వాటిపై కేసులు పెట్టాలని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఒప్పందాలు రద్దు చేయడానికి న్యాయ నిపుణులను సంప్రదిస్తామని సిఎం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News