Wednesday, April 2, 2025

కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు కేటాయిస్తూ జీఓను విడుదల చేసింది. గతంలో జగిత్యాల కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ మేరకు ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.

స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వంద కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధి పనుల జాబితా పంపించాలంటూ జిల్లా కలెక్టర్‌కు గతంలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 49 జిఓలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు ఈ ఉత్తర్వులను జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News