Friday, November 22, 2024

రుణమాఫీకి రేషన్ కార్డు తప్పసరి.. మార్గదర్శకాలు ఇవే

- Advertisement -
- Advertisement -

రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా సోమవారం రైతు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతీ కుటుంబం, రేషన్‌ కార్డును యూనిట్‌గా తీసుకోనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

రుణమాఫీ మార్గదర్శకాలు:

* రుణమాఫీ అమలుకు తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి.
* ప్రతీ యూనిట్‌లో మొదట మహిళల పేరుతో ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు.
* ఆ తర్వాత చిన్న మొత్తంలో ఉన్న రుణాలను మాఫీ చేసి.. పెద్ద అమౌంట్‌ను మాఫీ చేయనున్నారు.
* స్వల్పకాలిక రుణాలను కూడా మాఫీ చేయనున్నారు.
* రూ.2 లక్షల పైబడి ఉన్నా రుణాలకు రైతులే డబ్బులు చెల్లించుకోవాలి.
* 12 డిసెంబర్‌ 2018 నుంచి 9 డిసెంబర్‌ 2023 వరకు తీసుకున్న అన్ని పంటలకు రుణమాఫీ చేయనున్నారు.
* రెన్యువల్‌ చేసిన రుణాలకు ఈ పథకం వర్తించదు.
* అన్ని వాణిజ్య బ్యాంక్‌లు, గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News