Wednesday, January 22, 2025

రాష్ట్రంలో కొత్తగా రెండు డిగ్రీ, జూనియర్ కళాశాల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా రెండు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ, నిర్మల్ జిల్లా ముధోల్‌లో డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే నిజామాబాద్ జిల్లాలోని కమ్మర్‌పల్లిలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

నెరవేరిన పేద విద్యార్థుల కల : మంత్రి వేముల
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పేద విద్యార్థిని విద్యార్థుల సౌకర్యార్థం బాల్కొండలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, కమ్మర్‌పల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజి ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బాల్కొండ నియోజకవర్గ ప్రజలు,పేద విద్యార్థిని విద్యార్థుల పక్షాన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ప్రభుత్వ కళాశాలల ఏర్పాటుతో బాల్కొండ, కమ్మర్‌పల్లి మండల పేద విద్యార్థుల కల నెరవేరిందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News