Sunday, December 22, 2024

రాష్ట్రంలో పెట్రోల్ ధరలు తగ్గించాలి : కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : గ్యాస్ ధరలపై మాట్లాడే నైతిక హక్కు బిఆర్‌ఎస్ నేతలకు లేదని.. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ చెన్నమనేని వికాస్, దీప దంపతులు బిజెపిలో చేరారు. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్, ఎంపి ధర్మపురి అరవింద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, సత్యనారాయణలు మాట్లాడారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మార్పు రావాలి. అలాంటి మార్పు కోసమే వికాస్, దీప లాంటి వారు బిజెపి చేరాల్సిన అవసరం ఉందన్నారు.-

డాక్టర్ వికాస్, దీప వేములవాడ చుట్టు పక్కల ప్రాంతాల్లో బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అభినందించారు. దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలపై వ్యాట్ తగ్గిస్తే.. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో భూములు అమ్మనిదే, మద్యం అమ్మనిదే.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆయన ధ్వజమెత్తారు. దేశంలో అత్యధిక పెట్రోల్ ధర ఉన్న తెలంగాణలోనే. ఉత్తరప్రదేశ్ లో డీజిల్ పై 17 శాతం ఉంటే.. తెలంగాణలో 27 శాతం ఉంది. యూపిలో పెట్రోల్ పై వ్యాట్ 26 శాతం ఉంటే.. తెలంగాణలో 35 శాతం ఉందన్నారు. ఒక చేతిలో ఆసరా పెన్షన్ పెట్టి, మరో చేతిలో మద్యం బాటిల్ పెట్టిన ఇచ్చిన డబ్బులను తీసేసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్రోల్ అమ్మకాలపై విధించిన వ్యాట్ తగ్గించి.. ధరలను అందుబాటులోకి తేవాలని కోరారు.

హిందూబంధువులకు రాఖీ శుభాకాంక్షలు…
– రాఖీ పండుగ కానుకగా ప్రధాని నరేంద్ర మోడీ వంట గ్యాస్ ధరను 200 రూపాయలు తగ్గించారు.- ఈ నిర్ణయంతో ఉజ్వల యోజన లబ్ధిదారులకు సిలిండర్ పై రూ.400 తగ్గుతోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం నిరుద్యోగులు, ఎఎన్‌ఎంల ఆందోళనపై పోలీసుల లాఠీఛార్జ్ దుర్మార్గం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పాలనను మనం చూశాం. ప్రజలకు మేలు చేసే మార్పు రావాలి.. అది బిజెపితోనే సాధ్యమవుతుందన్నారు.
బిజెపిలో చేరడం సంతోషంగా ఉంది : డాక్టర్ వికాస్
జాతీయ నాయకులు వాజ్‌పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి పెద్దల ప్రభావం నాపై ఉందని డాక్టర్ వికాస్ అన్నారు. పార్టీ ముఖ్యనేతలతో బాల్యం నుంచే పరిచయం ఉంది.- వారి సమక్షంలో పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. చాలా రోజులుగా డాక్టర్ దీప, తాను సేవా కార్యక్రమాల్లో ఉన్నాం.- ప్రజలకు మరింత సేవ చేసేందుకు బిజెపిలో చేరామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో తనకు అప్పగించే బాధ్యతలను మనస్ఫూర్తిగా నిర్వర్తిస్తానని వెల్లడించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు బిజెపిదే అని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, ఉమారాణి, అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌తో పాటు వేములవాడ నియోజకవర్గానికి చెందిన బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News