Sunday, December 22, 2024

బిసి కుల గణనపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: బిసి కులగణన 3 నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సూచించింది. బిసి కులగణన చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ఎర్ర సత్యనారాయణ అనే వ్యక్తి 2019లో ఫైల్ చేశారు.

కాగా ఈ పిటిషన్‌పై సిజె ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. బిసి కులగణనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నా యని పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకు రాగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం మూడు నెలల్లో కులగణన చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణ ముగించింది.

బిసి కులగణన ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల తెలంగాణ బిసి కమిషన్ ఛైర్మన్ నిరంజన్ హర్షం వ్యక్తం చేశారు. కుల గణనను బిసి కమిషన్ సమర్థంగా నిర్వహిస్తుందని వెల్లడించారు. కమిషన్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నాంపల్లిలోని యూసఫియన్ బాబా దర్గాలో నిరంజన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బిసి కమిషన్‌కు మంచి పేరు వచ్చేలా పని చేసేందుకు యూసఫియన్ బాబా స్థైర్యం ఇవ్వాలని ప్రార్థించినట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News