- Advertisement -
రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ క్యాబినెట్ సబ్‌కమిటీ నిర్ణయించింది. చౌకధర దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా 24లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతోందన్న సబ్ కమిటీ.. దీనిలో సగానికి పైగా దారి మళ్లుతున్నట్లు గుర్తించింది.
రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డులను స్మార్ట్ కార్డుల రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. కుటుంబ సమగ్ర ఆరోగ్య వివరాలతో వీటిని జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత 10 ఏళ్లలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. దీనిపై ఇప్పటికే స్పందించిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులను త్వరలోనే ఇస్తామని వెల్లడించింది.
- Advertisement -