Wednesday, January 22, 2025

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు స్వస్తి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలనుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల స్వీకార ప్రక్రియకు ప్రభుత్వం స్వస్తి పలికింది. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా గాంధీ జయంతిని పురష్కరించుకుని ఈ నెల రెండు నుంచి ప్రారంభించాల్సిన ఈ కార్యక్రమాన్ని నిలిపివేసింది. కొత్త రేషన్ కార్డుల స్థానంలో ప్రభుత్వమే మరో అడుగు ముందుకు వేసి అత్యుత్తమ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని సంకల్పించింది.

ఫ్యామిలి డిజిటల్ కార్డ్డులను రాష్ట్రంలోని ప్రతి కుంటుబానికి అందజేసే ఈ కార్యక్రమాన్ని తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద అమలకు చేయాలని నిర్ణయించిన సిఎం గురువారం నాడు సికింద్రాబాద్‌లో ఈ కా ర్య క్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఇక కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకార ప్రక్రియకు ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. ప్యామిటి డిజిటల్ కా ర్డుల పైలెట్ ప్రాజెక్టు సర్వేను 119 నిమోజకవర్గాల్లో ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News