Sunday, December 22, 2024

మళ్లీ తెరపైకి ఈకార్ రేసింగ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నగరం లో నిర్వహించిన ఫార్ములా ఈ- కార్ రేస్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ- కార్ రేసింగ్ నిధుల కేటాయింపులపై మున్సిపల్ శాఖ ఎసిబికి ఫి ర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని అభ్యర్థించింది.నిధుల బదలాయింపుపై విచారణ జరపాలని కోరింది. దీంతో దీనిపై విచారణకు అ నుమతి కోరుతూ ఎసిబి ప్రభుత్వానికి లే ఖ రాసింది. నిబంధనలు పాటించ కుం డా ఎమ్‌ఏయూడీ నిర్వహణ సంస్థ ఎఫ్‌ఈఓకు రూ. 55కోట్ల చెల్లింపులు జరిగా యి. ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పాటించక పోవడంతో ఫార్ములా ఈ కా ర్ రేసింగ్ సెషన్ -10 రద్దు అయ్యింది. బోర్డు, ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అ నుమతి లేకుండానే రూ.55 కోట్లు విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులు జరిగాయి. కాగా గత ఏడాది ఫిబ్రవరి-11న హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కి.మీ. ట్రాక్‌లో మొదటి ఫార్ము లా -ఈ కార్ల పోటీ జరిగింది.

సీజన్ -9 ఫార్ములా -ఈ రేస్ నిర్వహణకు రూ.200 కోట్లు ఖర్చయింది. ఇందులో ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌కో రూ.150కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30 కోట్లు ఖర్చుచేశాయి. రహదారులు, ఇతర మౌలిక వసతులకు హెచ్‌ఎండిఎ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. ఇది విజయవం తం కావడంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి (సెషన్-10) నిర్వ హిం చేందుకు ఫార్ములా -ఈ ఆపరేషన్ (ఎఫ్‌ఈవో) తో ఎంఏయూ డీ 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది. ఈ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గా ఉండి ఖర్చంతా ప్రైవేటు సంస్థలైన గ్రీన్కో, ఫార్ములా -ఈనే భరించాల్సి ఉంది. కానీ గత సీజన్‌లో ప్రధాన భాగస్వామిగా ఉన్న గ్రీన్కో సంస్థను తొలగించి దానిస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేలా సీనియర్ ఐఎఎస్ ఒకరు సొం త నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అటు ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా, కనీసం ఆ ర్థికశాఖ దృష్టికి తీసుకెళ్లకుండానే ఆ ఉన్నతాధికారి ఈవెంట్ నిర్వహణకు హెచ్‌ఎండిఎ నుంచి రూ.55కోట్లు ముందస్తు చెల్లింపులు చేశారు.

ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓడిపోయి డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్ రేస్ నుంచి తప్పుకొంటున్నట్లు అదే నెలలో ఎఫ్‌ఈవో ప్రకటించింది. అనంతరం ‘సెషన్-10’ రద్దయిం ది. ఫిబ్రవరి 10న ఈవెంట్ జరిగి ఉంటే హెచ్‌ఎండిఎపై రూ.200 కోట్ల భారం పడేది. కానీ, ఇంతలో విషయం బయటపడ డంతో ప్ర భుత్వం సీరియస్ అయ్యింది.ఫార్ములా-ఈ రేసుపై చట్టవిరుద్ధంగా నిర్ణయం తీసుకున్న అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు కూడా జారీ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ స్పందన ఏ విధంగా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News