Monday, December 23, 2024

విఆర్‌ఎలు ఇక ప్రభుత్వ ఉద్యోగులు

- Advertisement -
- Advertisement -

రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న విఆర్‌ఏలను సూపర్ న్యూమరీ పోస్టుల్లో ప్రభుత్వం క్రమబద్ధీకరించిం ది. సిఎం ఆదేశాల మేరకు సిఎస్ శాంతికుమారి సోమవారం విఆర్‌ఎల క్రమబద్ధీకరణకు సంబంధించిన జిఓ 81ను విడుదల చేశారు. ఈ ఉత్తర్వు ల కాపీని విఆర్‌ఎల జెఎసి నాయకులకు సిఎం కె సిఆర్ సచివాలయంలో సోమవారం అందజేశా రు. ప్రస్తుతం విఆర్‌ఏలుగా పనిచేస్తున్న అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో విఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు, స్థిరీకరణ అంశాలపై ఆదివారం రాష్ట్ర సచివాలయంలో సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష తరువాయి 10లో
నిర్వహించి నీరటి, మస్కూరు, లష్కర్ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలుచుకుంటున్న, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా మిగిలిన విఆర్‌ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన ఉత్తర్వులను సోమవారం ప్రభుత్వం విడుదల చేయడంతో సిఎం వాటిని ఆ సంఘాల నాయకులకు అందచేశారు. దీంతో రాష్ట్రంలోని విఆర్‌ఏలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

16,758 మంది విఆర్‌ఏలు మూడు కేటగిరీలుగా…
61 ఏళ్ల లోపు ఉన్న 16,758 విఆర్‌ఏలను వాళ్ల విద్యార్హతల ఆధారంగా మూడు కేటగిరీలుగా వారిని వివిధ శాఖల్లో, వివిధ పోస్టుల్లో నియమించనున్నట్టు జిఓ 81లో తెలిపింది. ఈ జిఓలో పేర్కొన్న మాదిరిగా ఒకటి నుంచి 10వ తరగతి చదివిన 10,317 మంది విఆర్‌ఏల పేస్కేల్ రూ.19,000 ల నుంచి రూ.- 58,850లుగా నిర్ణయించిన ప్రభుత్వం వారిని లాస్ట్ గ్రేడ్ సర్వీస్‌లో కొనసాగాలని పేర్కొంది. వీరితో పాటు ఇంటర్ చదివిన 2,761 మంది ఉద్యోగుల పేస్కేల్ రూ.22, 240ల నుంచి -రూ. 67,300లుగా నిర్ణయించిన ప్రభుత్వం వారిని రికార్డు అసిస్టెంట్లుగా నియమించనున్నట్టు తెలిపింది. డిగ్రీ ఆపైన చదివిన మరో 3,680 మంది ఉద్యోగుల పేస్కేల్ రూ. 24,280ల నుంచి రూ.72,850లుగా నిర్ణయించిన ప్రభుత్వం వారిని జూనియర్ అసిస్టెంట్లుగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నట్టు ఈ జిఓలో పేర్కొంది.

ఇక 2011 అక్టోబర్ 01వ తేదీన నియామకం అయిన విఆర్‌ఏల పదవీ విరమణకు సంబంధించిన గరిష్ట వయో పరిమితిని నిర్ణయించలేదు. దీంతోపాటు 61 ఏళ్లు దాటి ఇంకా విఆర్‌ఏలుగా కొనసాగుతున్న 3,797 మందికి సంబంధించిన వారి వారసులను వాళ్ల విద్యార్హతల ఆధారంగా కారుణ్య నియామకం కింద లాస్ట్ గ్రేడ్ సర్వీస్, రికార్డు అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్ కేటగిరీల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి వారి విద్యార్హతలను బట్టి నాలుగు శాఖల్లో విఆర్‌ఏలను సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు విఆర్‌ఏల విద్యార్హతను బట్టి నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ శాఖల్లో ప్రభుత్వం వారిని సర్దుబాటు చేయనుంది.
జిఓలో ప్రభుత్వం పేర్కొన్న వివరాలు
విద్యార్హత కేటగిరీ పేస్కేల్ ఉద్యోగుల సంఖ్య
ఒకటో తరగతి నుంచి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ రూ.19 వేల నుంచి రూ.58,850లు 10,317
10వ తరగతి వరకు
ఇంటర్‌మీడియట్ రికార్డు అసిస్టెంట్ రూ.22,240 నుంచి రూ.67,300లు 2,761
లేదా దాని సమానం
డిగ్రీ ఆపై చదువులు జూనియర్ అసిస్టెంట్ రూ.24,280ల నుంచి రూ.72,850లు 3680
లేదా దాని సమానం

ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా,
ప్రజాకంటకంగా విఆర్‌ఎ వ్యవస్థ కొనసాగింది : సిఎం
ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా, ప్రజాకంటకంగా విఆర్‌ఎ వ్యవస్థ కొనసాగిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. గ్రామాల్లో తరతరాలుగా, అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా వీరంతా పనిచేస్తూ వచ్చారని తెలిపారు. మహారాష్ట్రలో కూడా చాలా తక్కువ జీతంతోని విఆర్‌ఎలు పనిచేస్తున్నారని మహారాష్ట్ర బిఆర్‌ఎస్ నాయకులు తెలిపారని పేర్కొన్నారు. విఆర్‌ఎల క్రమబద్ధీకరణను వీరంతా అభినందిస్తున్నారని సిఎం అన్నారు. ఈ సందర్భంగా కొత్త ఉద్యోగాలు చేపట్టనున్న విఆర్‌ఎలందరికీ సిఎం శుభాభినందనలు తెలిపారు. 10వ తరగతి అర్హత కలిగిన 10,317 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో పనిచేస్తారని, ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన 2,761 మంది రికార్డు అసిస్టెంట్ హోదాతో, డిగ్రీ ఆ పై విద్యార్హత కలిగిన 3,680 మంది జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తారని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఈ పోస్టులకు అప్రూవల్ ఇచ్చిందని తెలిపారు.

మరో కేటగిరీలో 3,797 మంది 61 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారని, వారు ఇంత కాలం సమాజానికి చేసిన సేవకు గాను, మానవీయ కోణంలో ఆలోచించి, వారు కొనసాగుతున్న క్వాలిఫికేషన్‌తోనే వారి పిల్లలకు ఉద్యోగాలిస్తామని సిఎం స్పష్టం చేశారు. విఆర్‌ఎల జెఎసి ఎంత తొందరగా లిస్ట్ ఇస్తే అంత తొందరగా వారికి ఆర్డర్ ఇస్తామని తెలిపారు. ఈ ఆర్డర్‌లోనే ఆ విషయాలను పొందుపరిచినట్లు సిఎం చెప్పారు. వారు వారి పిల్లలను తీసుకొని వస్తే వారి విద్యార్హతలను బట్టి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపడుతుందని వెల్లడించారు. విఆర్‌ఎలు ఇక నుంచి పే స్కేల్ ఉద్యోగులు అని సిఎం స్పష్టం చేశారు. మీరందరూ ఆయా డిపార్ట్‌మెంట్లలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా చదివి ప్రమోషన్లు కూడా తెచ్చుకోవాలని కోరుతున్నానని సిఎం విఆర్‌ఎలకు సూచించారు.
ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా కెటిఆర్ చొరవ
విఆర్‌ఎల క్రమబద్దీకరణ, సర్దుబాటు ప్రక్రియ తొందరగా పూర్తయ్యేలా, మీ దగ్గరకు చేరేలా చొరవ తీసుకున్న మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్భంగా ఉత్తర్వులిస్తే ఇస్తే బాగుంటందని సూచించి, సిఎస్ శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సోమవారమే ఉత్తర్వులు వచ్చే విధంగా కృషి చేశారని సిఎం తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లీగల్ సమస్యలు తలెత్తకుండా జీవోను రూపొందించినందుకు ఉన్నతాధికారులులకు సిఎం కెసిఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News