Saturday, July 6, 2024

మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళా క్యాంటీన్లు

- Advertisement -
- Advertisement -

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలకు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క కార్యరూపం ఇచ్చారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఈ నెల 21 శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు రెండు మహిళా శక్తి క్యాంటిన్లను మంత్రి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్కతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కూడా పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.

మంత్రి సీతక్కకు ఇందిరాశోభన్ కృతజ్ఞతలు
సెర్ప్ ఉద్యోగులు, మహిళా సంఘాలతో కలిసి స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జి)లకు రూ.10 లక్షల బీమా కల్పించడంతో పాటు ఆధార్, మీ సేవా కేంద్రాలు, స్కూల్ యూనిఫామ్‌లను కుట్టడం, మహిళా సంఘాలకు క్యాంటీన్లు నిర్వహణకు ఇవ్వడం వంటి కార్యకలాపాలతో ఆర్థికంగా మహిళలను ప్రోత్సహించి సమాజంలో వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నదుకు మంత్రి సీతక్కను మహిళా సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. గురువారం మంత్రిని ఆమె నివాసం వద్ద ఇందిరాశోభన్ ఆధ్వర్యంలో మహిళా సంఘాల ప్రతినిధులు కలిశారు. అలాగే సరైన సమయంలో స్కూల్ యూనిఫామ్‌లు కుట్టి ఇచ్చేందుకు తమను ప్రోత్సహించినందుకు మంత్రిని అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News