Saturday, February 22, 2025

8 మంది ఐఎఎస్‌ల బదిలీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో 8 మంది ఐఎఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార కమిషనర్, మార్కెటింగ్ డైరెక్టర్‌గా కె.సురేంద్రమోహన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యశ్రీ సీఈవో ఎల్.శివకుమార్‌ను జిఎడిలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆరోగ్యశ్రీ సిఈవోగా ఆర్.వి. కర్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. వాణిజ్య పన్నుల శాఖ డైరెక్టర్ గా కె.హరిత నియమితులయ్యారు. విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా యాస్మిన్ బాషాకు అదనపు బాధ్యతలు, రాష్ట్ర ఫుడ్స్ ఎండిగా కె.చంద్రశేఖర్‌రెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. వనపర్తి అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ నారాయణపేట అదనపు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. టెక్స్‌టైల్స్, హ్యాం డ్లూమ్ డైరెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి మాతృ సంస్థకు బదిలీ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News