హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐపిఎస్‌ల బదిలీలు చోటు చేసుకున్నాయి. 29 మంది ఐపిఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ రతన్‌ను పోలీస్ హౌసింగ్ ఎండిగా పోస్టింగ్ ఇచ్చారు. నగర పోలీస్ కమిషన్ సివి ఆనంద్‌కు నార్కోటిక్స్ అడిషినల్ డిజిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్యను నియమించారు. అడిషినల్ డీజి ఆర్గనైజేషన్‌గా కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, షీ టీమ్స్ డిజిగా షికా గోయల్, రైల్వే, రోడ్ సేఫ్టీ అడిషినల్ డిజిగా శివధర్ రెడ్డి,
పోలీస్ హోంగార్డ్ అడిషినల్ డిజిగా అభిలాష్ బిష్త్, కంప్యూటర్ సర్వీసెస్ అడిషినల్ డిజిగా వీరిశెట్టి వెంకట శ్రీనివాసరావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండిగా రాజీవ్ రతన్, బెటాలియన్స్ అడిషినల్ డిజిగా స్వాతి లక్రా, ఆపరేషన్స్ అడిషినల్ డిజిగా విజయ్ కుమార్, ఫైర్ సర్వీసెస్ డిజిగా నాగిరెడ్డి, సిటీ పోలీస్ లా అండ్ ఆర్డర్ అడిషినల్ కమిషనర్‌గా విక్రమ్ సింగ్ మాన్, ఐజి పర్సనల్‌గా కమలాసన్‌రెడ్డి, సైబర్ సెక్యూరిటీ ఐజిగా స్టీఫెన్ రవీంద్ర, ట్రాఫిక్ అదనపు కమిషనర్‌గా జి.సుధీర్ బాబు తదితరులను నియమించారు.