2030 నాటికి 20వేల
హరిత విద్యుత్ ఉత్పత్తే
లక్షం మిగులు విద్యుత్
సాధన ధ్యేయంగా త్వరలో
నూతన విద్యుత్ విధానం
రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి
ఎఐ, ఫ్యూచర్ సిటీలు
మీడియా సమావేశంలో
డిప్యూటీ సిఎం భట్టి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం గ్రీన్ పవర్ రంగంలో అద్భుత విజయాలను సాధిం చి, దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందని డి ప్యూటీ సిఎం మల్లు భట్టి అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాంకేతికత, ఫార్మాస్యూటిక ల్స్, ఉత్ప త్తి, వ్యవసాయా రంగాల అభివృద్ధికి కేంద్రం గా ఉద్భవించిందన్నారు. శుక్రవారం హైదరాబాద్ మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛమైన శక్తి వనరుల వినియోగంలో ముందంజ వేస్తూ, తెలంగాణ 11,399 గ్రీన్ పవర్ సామర్థ్యాన్ని సొంతం చే సుకుని, 2030 నాటికి 20,000 మెగావాట్ల ల క్ష్యాన్ని చేరుకునేదిశగాముందుకు సాగుతోందన్నా రు. విస్తరిస్తున్న పట్టణ జనాభా అవసరాలను తీర్చే ఆకుపచ్చ, స్థిరమైన పట్టణ పర్యావరణ వ్యవస్థ రూపకల్పనకు ఫ్యూచర్ సిటీకి శ్రీ కారం చుట్టామన్నారు. హైదరాబాద్ సమీపంలో అత్యాధునిక కృత్రిమ మేధస్సు, స్మార్ట్ టె క్నాలజీలతో ఏ ఐ సిటీ ద్వారా ఆధునిక నగర అభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు. తెలంగాణను గ్లోబ ల్ ఫార్మాస్యూటికల్ హబ్‌గా తీర్చిదిద్దుతూ, లైఫ్ సైన్సెస్ రంగంలో అగ్రగామిగా మార్చేలా ఫార్మాసిటీ ఏర్పాటవుతోందని చెప్పారు. మెరుగైన కనెక్టివిటీ కోసం నాల్గవ నగరం రీజినల్ రింగ్ రోడ్, మెట్రో రైలు విస్తరణ, , విమానాశ్రయం, పారిశ్రామిక కారిడార్‌తో రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ పవర్‌హౌస్‌గా మారుస్తున్నాయని చెప్పారు.
పునరుత్పత్తి శక్తి సామర్థ్యాలు :
ప్రస్తుత పునరుత్పత్తి శక్తి సామర్థ్యం 11,399 మెగావాట్లు, 7,889 మెగావాట్ల సౌరశక్తి,,2,518 మెగావాట్ల జలశక్తి, 771 మెగావాట్ల పంపిణీ పునరుత్పత్తి శక్తి, 221 మెగావాట్ల ఇతర పునరుత్పత్తి శక్తి (128 మెగావాట్లు పవన శక్తి), శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టుల్లో పంప్డ్ స్టోరేజ్ వున్నాయని, ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ వంటి ఆధునిక పరిష్కారాలు పరిశీలనలో ఉన్నాయన్నారు. 54,717 మెగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యం కలిగి, దేశంలో టాప్-8 రాష్ట్రాలలో ఒకటిగా నిలుస్తుందని, విద్యుత్ వాహన అభివృద్ధి, 872 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
2024లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 15,623 మెగా వాట్ల నుండి, 2030 నాటికి 24,215 మెగావాట్లు, 2035 నాటికి 31,809 మెగావాట్ల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. 2030 నాటికి 20వేల మెగావాట్ల లక్ష్యంగా పని చేస్తున్నామని, ఇందుకోసం స్వచ్ఛమైన, నమ్మదగిన, సరసమైన, స్థిరమైన శక్తి వనరులు ముఖ్యమైనవని చెప్పారు. 300 సూర్యకాంతి రోజులతో రాష్ట్రం ఫోటోవోల్టిక్ సోలార్ ప్రాజెక్టులకు అనుకూలమైన ప్రాంతంగా నిలుస్తోందన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టులు, గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ, పంప్‌డ్ స్టోరేజ్ వంటి ఆధునిక పద్ధతులను ప్రోత్సహిస్తోందని వివరించారు. విద్యుత్ వాహన ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య ప్రస్తుతం 872కి చేరుకుందని, పారిశ్రామికవేత్తలకు పన్ను మినహాయింపులు, చెల్లింపుల సబ్సిడీలు వంటి ప్రోత్సాహకాలు అందించడం ద్వారా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని తెలిపారు. అంతేకాక, వ్యర్థాలను శక్తిగా మార్చడం వంటి ప్రాజెక్టులను కూడా ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోందని చెప్పారు.
ప్రజలకు అందుబాటులో విద్యుత్ : తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ప్రజల జీవితాలను మెరుగుపరచడంతో పాటు శక్తి వినియోగంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం. ఈ క్రమంలో రాష్ట్రం మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి పెట్టిందని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ పునరుత్పత్తి శక్తి రంగంలో ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని, ఈ రంగంలో రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయన్నారు. ప్రస్తుత పునరుత్పత్తి శక్తి ప్రాజెక్టుల ద్వారా వేలాది కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రం సుస్పష్టమైన విధానాలను అమలు చేస్తోందన్నారు. 2030 నాటికి 20వేల మెగావాట్ల సామర్థ్యాన్ని చేరుకోవడం మాత్రమే కాకుండా, తెలంగాణ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని తెలిపారు. తెలంగాణ పునరుత్పత్తి శక్తి రంగంలో సాధిస్తున్న ఈ అద్భుత విజయాలు రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేస్తూ శక్తి వినియోగంలో స్వచ్ఛమైన మార్గాలను అనుసరించి దేశానికే ఒక దిశానిర్దేశం అందిస్తున్నాయని వివరించారు.