Sunday, December 22, 2024

గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు?

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను జమ చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగ నాటికి రాష్ట్రంలోని అర్హులైన రైతలందరీ ఖాతాల్లో సర్కార్ డబ్బులు జమ చేయనుందని సమాచారం.

శుక్రవారం(సెప్టెంబర్) రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటిలో రైతు భరోసాపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఈ పథకం విధివిధానాలపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది. ఎకరాకు రూ.7,500 చొప్పున రెండు విడతల్లో రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రకటించిన సంగతి తెలసిందే. బిఆర్ఎస్ హయాంలో ఎకరానికి రూ.5వేలు చొప్పున రెండు విడతల్లో రూ.10వేలు ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News