Sunday, January 19, 2025

వరంగల్- నల్లగొండ -ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

వరంగల్ , -నల్లగొండ, -ఖమ్మం  గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికల షెడ్యూల్ గురువారం విడుదల అయ్యింది. మే 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా మే 9 వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. మే 10న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మే 13 వరకు గడువు కేటాయించారు. గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ పోలింగ్ మే 27న జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News