Wednesday, January 22, 2025

‘503’ గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

Telangana Group 1 notification released

తెలంగాణలో తొలి గ్రూప్-1 నోటిఫికేషన్
విడుదల ఇంటర్వూలు లేకుండా
ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారా ఎంపిక
నోటిఫికేషన్ విడుదల చేసిన టిఎస్‌పిఎస్‌సి
మే 2నుంచి 31 వరకు దరఖాస్తుల స్వీకరణ
జులై లేదా ఆగస్టులో ప్రిలిమినరీ
లేదా డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్ష
మొదటిసారి ఇడబ్లూఎస్, స్పోర్ట్ కోటా

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర యువతకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. 503 గ్రూప్-1 పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సోమవారం పోలీస్ శాఖలో 16,614 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాగా, మంగళవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిఎస్‌పిఎస్‌సి) 503 గ్రూప్ -1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మే 2వ తేదీ నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ తెలిపింది.

టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్ బి.జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించగా కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత తొలిసారిగా స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్వ్యూలు లేకుండా నియామకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారానే మొదటిసారి గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష జులై లేదా ఆగస్టు నెలలో, మెయిన్స్ పరీక్ష నవంబరు లేదా డిసెంబరు నెలలో జరిగేందుకు అవకాశాలున్నట్లు టిఎస్‌పిఎస్‌సి నోటిఫికేషన్‌లో తెలిపింది. గ్రూప్ -1 సర్వీసెస్‌లో తొలిసారి ఇడబ్ల్యూఎస్ , స్పోర్ట్ కోటా రిజర్వేషను అమలు చేయనున్నట్లు కమిషన్ పేర్కొంది.

ఒటిఆర్ తప్పనిసరి

గ్రూప్ 1 దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా నూతన రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని టిఎస్‌పిఎస్‌సి తెలిపింది. గ్రూప్ -1 మెయిన్స్‌కు మల్టీజోన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక జరగనుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు మొదటిసారి ప్రిలిమ్స్ ప్రశ్నాపత్రాన్ని ఉర్ధూలో ప్రచురించనున్నట్లు ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలకు ఇ క్వశ్నన్ పేపర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. అలాగే మెయిన్స్ జవాబు పత్రాలను డిజిటల్ మూల్యాంకనం విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు కమిషన్ పేర్కొంది.

గ్రూప్ 1 పోస్టుల వివరాలు

1. డిప్యూటీ కలెక్టర్ 42

2. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డిఎస్‌పి) 91

3. మండల పరిషత్ డవలప్‌మెట్ ఆఫీసర్(ఎంపిడిఒ) 121

4.కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ 48

5.రీజనల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ 04

6.జిల్లా పంచాయతీ అధికారి 05

7.జిల్లా రిజిస్ట్రార్ 05

8.డిప్యూటీ సూపరింటెండెంట్ ఆప్ జైల్స్ 02

9.అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 08

10.అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26

11.గ్రేడ్ -2 మున్సిపల్ కమిషనర్ 41

12. సోషల్ వెల్ఫేర్ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ 03

13.జిల్లా బిసి అభివృద్ధి అధికారి 05

14.జిల్లా గిరిజన సంక్షేమ ఆధికారి 02

15.జిల్లా ఉపాధి అధికారి 02

16.గ్రేడ్ 2 అడ్మినిస్ట్రేటివ్ ట్రెజరర్ పోస్టులు 20

17.అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 38

18.అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News