Friday, January 24, 2025

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సారనికి 5వ తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు పెద్ద సంఖ్యలో విద్యార్ధులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో విద్యార్థులకు ప్రవేశం కల్పించేందుకు

తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ( ఎస్‌డబ్లుఆర్‌ఈఐఎస్) ద్వారా ప్రతి సంవత్సరం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ప్రవేశ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఫలితాల కోసం వారి నిరీక్షణ ముగిసింది. తాజాగా గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలను https://tgcet.cgg.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు గురుకులాల్లో ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్యా బోధన, ఉచిత వసతి ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News