Wednesday, January 22, 2025

నేటి తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలు: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మన్నెగూడలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ…. చేనేతలకు డిసిబిసి, టెస్కాబ్ ద్వారా రూ. 200 కోట్ల రుణాలు ఇస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. చేనేతలు ఇంటి వద్ద షెడ్ నిర్మించుకునేందుకు సాయం చేస్తామన్నారు. చేనేతమిత్త పథకం కింద ప్రతి మగ్గానికి నెలకు రూ. 3000 వేలు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. చేనేతమిత్ర పథకం ఆగస్టు, సెప్టెంబర్ నుంచి అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

నేతన్నకు భీమా పథకం ద్వారా రూ, 5 లక్షల భీమా కల్పిస్తున్నమన్నారు. చేనేత హెల్త్ కార్డుల ద్వారా ఓపి సేవలకు రూ. 25 వేలు ఇస్తామని కెటిఆర్ తెలిపారు. నేటినుంచి తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలు అవుతుందన్నారు. రూ.40,50 కోట్లతో 10,652 ఫ్రేమ్ మగ్గాలు అందుబాటులోకి తెస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. మృతి చెందిన కార్మికుల కుటుంబానికి టెస్కో సాయం రూ.25 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. చేనేత మీద 5 శాతం జీఎస్టీ వేసిన నేత మోడీ అని కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేత వద్దు.. అన్ని రద్దు అనేలా కేంద్రం తీరు ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News