Monday, December 23, 2024

అద్భుతం.. తెలంగాణకు హరితహారం

- Advertisement -
- Advertisement -

పరుచుకున్న పచ్చదనం ప్రభుత్వ సంకల్పం, అధికారులు, సిబ్బంది కృషికి నిదర్శనం
కర్ణాటక అడిషనల్ చీఫ్ సెక్రటరీ జావేజ్ అక్తర్

హైదరాబాద్ : తెలంగాణకు హరితహారం అద్భుతమైన కార్యక్రమమని కర్ణాటక రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖ అడిషనల్ చీఫ్ సెక్రటరీ జావేద్, అక్తర్ అన్నారు. శుక్ర, శనివారాల్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. తెలంగాణకు హరితహారం, పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుపై ఆయన అధ్యయనం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో పర్యటించిన ఆయన దూలపల్లి ఫారెస్ట్ రీసెర్చ్ నర్సరీ, కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డు వెంట పచ్చదనం, అలాగే హైదరాబాద్ లో అంతర్గత రోడ్ల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ (రహదారి వనాలు), మీడియన్ పాంటేషన్లను పరిశీలించారు.

Also Read: ఖలిస్తాన్ కమాండో చీఫ్ పరమ్‌జిత్ పంజ్వార్ పాకిస్థాన్‌లో కాల్చివేత

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమం అద్భుతంగా ఉందన్నారు. తాను పర్యటించిన అన్ని ప్రాంతాలు పచ్చదనం పరుచుకొన్నదని జావేద్ అక్తర్ ప్రశంసించారు. ప్రభుత్వ సంకల్పానికి, అధికారులు, సిబ్బంది, ప్రజల కృషి తోడైన ఫలితాలు కనిపిస్తున్నాయని అన్నారు. సిఎం ఓఎస్డీ (హరితహారం) ప్రియాంక వర్గీస్ స్వయంగా కర్ణాటక అధికారికి వివిధ ప్రాంతాల్లో హరితహరం కార్యక్రమాలను వివరించారు. కండ్లకోయ ఆక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను చాలా చక్కగా అభివృద్ది చేశారని, రాష్ట్ర మంతటా ఇదే తీరులో 109 ఫారెస్ట్ పార్కులను పర్యావరణ పరంగా ఏర్పాటు చేయటం అభినందనీయమని ఆయన అన్నారు.

Also Read: సొంత రాబడుల వృద్ధిరేటులో తెలంగాణ మొదటిస్థానం

ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు, నగరంలోనూ పచ్చదనం కోసం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు. కర్ణాటక ప్రభుత్వం కూడా పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుకు ప్రణాళికలు రూపొందిస్తోందని, ఆ అధ్యయనంలో భాగంగా తెలంగాణలో పర్యటించినట్లు జావేద్ అక్తర్ తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత అరణ్యభవన్‌లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పిసిసిఎఫ్, హెచ్‌ఓఓఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్, కంపా పిసిసిఎఫ్ లోకేష్ జైస్వాల్, విజిలెన్స్ పిసిసిఎఫ్ ఏలూసింగ్ మేరుతో జావేద్ సమావేశం అయ్యారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణకు హరితహారం కార్యాచరణ, ఫలితాలను పిసిసిఎఫ్ ఈ సందర్భంగా వివరించారు. పర్యటనలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి డిఎఫ్‌ఓలు ఎం. జోజి, సుధాకర్‌రెడ్డి, జానకిరామ్ తో పాటు, అటవీ శాఖ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News