Monday, December 23, 2024

తెలంగాణ హరితోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

- Advertisement -
- Advertisement -
  • కలెక్టర్ అమోయ్‌కుమార్

మేడ్చల్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా సోమవారం తెలంగాణ హరితోత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ అన్నారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో నర్సరీలను, ప్రకృతి వనాలను సందర్శించి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో తప్పకుండా హరితహారం కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు.

అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో, జిల్లాలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు జరిగిన కృషిని ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలను అందరికీ వివరించాలని కలెక్టర్ అన్నారు. అడవుల పునరుద్దరణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన వచ్చిన ఫలితాలను తెలియజేయాలన్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించే తెలంగాణ హరితోత్సవాలలో రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొని మొక్కలు నాటుతారని కలెక్టర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News