Monday, December 23, 2024

మంత్రి కెటిఆర్ నాయకత్వంలో తెలంగాణకు ఉజ్వల భవిష్యత్

- Advertisement -
- Advertisement -
  • మంత్రి కెటిఆర్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్సీ, ఎఫ్‌డిసి చైర్మన్

గజ్వేల్: సిఎం కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి కె టిఆర్ నడుచుకుంటూ అహర్నిషలు ప్రజల మేలుకోసం పరితపిస్తున్నారని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఎఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్‌లు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఆవరణలో ఎఎంసి ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ ,మున్సిపల్ , ఐటి శాఖల మంత్రి కెటిఆర్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఐటి, మున్సిపల్ శాఖలో అనేక విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత కెటిఆర్‌కు దక్కిందన్నారు. మంత్రి కెటిఆర్ నాయకత్వంలో తెలంగాణకు ఉజ్వల భవిష్యత ఉంటుందని అన్నారు.

కెటిఆర్ కృషి వల్లే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతూ బంగారు తెలంగాణ నిర్మాణంలో యువనేత అవిశ్రాంతంగా కృషిచేస్తున్నారని వారు కొనియాడారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల నినాదనాల హోరు మధ్య 47 కిలోల భారీ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తా,ఎంపిపి అమరావతి, బిఆర్‌స్ పార్టీ మండల , పట్టణ శాఖల అధ్యక్షులు బెండె మధు, నవాజ్‌మీరా,ఆత్మ కమిటీ ఛైర్మన్ ఊడెంక క్రిష్ణారెడ్డి,మున్సిపల్ వైస్ ఛైర్మన్ జకీయొద్దీన్, ఎఎంసి వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి,కౌన్సిలర్లు బాలమణి శ్రీనివాస్ రెడ్డి, గోపాల రెడ్డి, బొగ్గుల చందు, వివిధ కమిటీల డైరక్టర్లు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News