Sunday, November 17, 2024

దేశ సంపద పెంచినా..శూన్య హస్తమే!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశ స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో తెలంగాణ తలసరి నికర రాష్ట్ర ఉత్పత్తి ఆరేళ్లలో 72 శాతానికి పైగా పెరిగిందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. రాజ్యసభలో సిపిఎం పార్లమెంట్ సభ్యుడు జాన్ బ్రిట్టాస్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమించారు. 2022 -23లో తెలంగాణ రాష్ట్ర తలసరి దేశీయోత్పత్తి రూ.3,08,732 అని కేంద్ర మంత్రి వెల్లడించారు. గత ఐదేళ్లలో రాష్ట్రాల ద్వారా జిడిపికి తలసరి సహకారం వివరాలను ఎంపి కోరగా.. వివరాలను కేంద్ర మంత్రి వెల్లడించారు. తెలంగాణ తలసరి నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (బేస్ ఇయర్ 2011– -12) రూ. 1,79,358, (2017- 18), రూ. 2,09,848 (2018- 19), రూ. 2,31,326 (2019 -20), రూ. 2,25,687 (2020- 21),

రూ. 2,65,942 (2021- 22), తెలంగాణ రాష్ట్రం 2022 -23లో జిడిపి రూ. 3,08,732 ఉందన్నారు. దేశ జిడిపిలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందనానరు. రూ. 3,01,673 జిడిపితో కర్ణాటక రెండో స్థానంలో ఉండగా, రూ. 2,96,685తో హర్యానా రాష్ట్రం తర్వాతి స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి తెలిపారు. అదే విధంగా గత ఐదేళ్లలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఖజానా నుంచి పంపిణీ చేసిన వివరాలను కేంద్రమంత్రి తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు రాష్ట్రాలకు కేంద్రం వాటాను వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని పంపిణీ చేసినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నిధుల విడుదల జరిగిందన్నారు.

 రాష్ట్రానికి ఐదేళ్లుగా కేంద్రం నుంచి అదే వాటా..
–అద్భుత పని తీరుతో అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఐదేళ్లుగా కేంద్రం పంపిణీ చేసిన వాటానే కొనసాగిస్తోంది. 2018 19లో రూ.18560.88 కోట్లు ఇవ్వగా.. 2022 23లో 19668.15 కోట్లను తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అందజేసింది. దేశ జిడిపిలో 72 శాతం పెరుగుదల అందించిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు.
మరో సారి అగ్రపథంలో రాష్ట్రం..
దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రమని మరోసారి నిరూపితమైంది. ఈ యేడాది తలసారి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలను వెనక్కినెట్టి తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. తలసరి ఆదాయంలో తెలంగాణ ముందు వరుసలో నిలిచిందని స్వయంగా పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ యేడాది 3 లక్షల 8 వేలకు పైగా ఆదాయంతో తెలంగాణ తొలి స్థానం దక్కించుకుంది. కర్ణాటక, హర్యానాతో పాటు ఇతర పెద్ద రాష్ట్రాలను అధిగమించి తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఒకవైపు రాష్ట్రాభివృద్ధికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోయినా తెలంగాణ అద్భుత పని తీరుతో దేశంలోనే అగ్ర స్థానంలో నిలిచి శభాష్ అనిపిస్తోంది.

ఆరేళ్లలో రాష్ట్ర జిడిపి 72 శాతం పెరుగుదల..
గడిచిన ఆరేళ్లలోనే రాష్ట్ర జిడిపి 72 శాతంగా పెరిగింది. రాష్ట్ర తలసరి ఆదాయ వృద్ధిరేటు 11 నుంచి 15.1 శాతానికి పెరిగింది. 2022 -23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన దేశ తలసరి ఆదాయ గణాంకాల్లో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఏ రాష్ట్రానికీ అందనంత ఎత్తులో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 1 లక్షా 24 వేలా 104 గా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం ఇప్పుడు ఏకంగా 3 లక్షల 8 వేలకు పైగా పెరిగింది. బిఆర్‌ఎస్ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ తలసరి ఆదాయం ఏకంగా 150 శాతానికి పైగా వృద్ధి చెందింది. తెలంగాణ తర్వాత కర్ణాటక, మూడో స్థానంలో హర్యానా నిలిచింది. 11వ స్థానంలో బిజెపి పాలిత గుజరాత్ రాష్ట్రం నిలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News