Monday, December 23, 2024

ఐటీ పరిశ్రమలో తెలంగాణకు సాటిలేదు

- Advertisement -
- Advertisement -
సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్దిలో పరుగులు
బెంగుళూరు తరువాత హైదరాబాద్ ఐటీలో గణనీయమైన వృద్ధి
మూడు రోజుల పర్యటనలో తమిళనాడు ఐటి శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ ప్రశంసలు

హైదరాబాద్ : ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను, ఐటీ అనుబంధ విధానాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు కృషి చేయనున్నట్లు తమిళనాడు రాష్ట్ర రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పలనివేల్ త్యాగరాజన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పాలసీలను కార్యక్రమాలను పరిశీలించేందుకు ఆయన ఆధ్వర్యంలోని ఒక బృందం రాష్ట్రానికి మూడు రోజుల పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా మొదటి రోజు మున్సిపల్, ఐటీ, పట్టణాభివృద్ది శాఖ మంత్రి. కె. తారక రామారావుతో సచివాలయంలో సమావేశం అయ్యారు. శుక్రవారం రెండవ రోజు పర్యటనలో టీ వర్క్, టీ హబ్, వీ హబ్, గచ్చిబౌలిలోని టీఫైబర్ కార్యాలయాన్ని సందర్శించిటెక్ మహీంద్రా కార్యాలయంలో పలువురు ఐటి పరిశ్రమ భాగస్వాములతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా త్యాగరాజన్ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం ఉన్న సిఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేళ్ల తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని ప్రశంసించారు.

ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ గణనీయమైన వృద్ధి సాధించిందన్నారు. ఈ రెండు నగరాలకు తోడుగా ఉండాల్సిన తమిళనాడు గత పాలకుల నిర్లక్షంతో ఐటీలో వృద్ధి సాధించలేకపోయిందన్నారు. తాను ఐటీ బాధ్యతలు చేపట్టి తరువాత తమిళనాడులో ఎలాంటి విధానాలు పాటిస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్‌ను సందర్శించినట్లు వెల్లడించారు. తన పర్యటన తప్పకుండా అక్కడి ప్రజలకు మేలు చేకూర్చేలా ఉంటుందన్నారు. అంతేగాకుండా హైదరాబాద్ కేంద్రంగా ఐటీ పరిశ్రమ 9 ఏళ్లలో అద్భుతంగా ముందుకెళ్లిందని, ఐటీ రంగంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఐటీ పాలసీల అద్భుతంగా ఉంది ఈ పాలసీ ని మేము అడాప్ట్ చేసుకుంటామన్నారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలు, ఐటీ, ఐటీ అనుబంధ పాలసీలు, పరిశ్రమల బలోపేతం కోసం చేపట్టిన అనేక అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మా బృందానికి మంత్రి కేటీఆర్ వివరించినట్లు చెప్పారు. తమిళనాడు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తనకు ఈ పర్యటన ఎంతో ఉపయోగం ఉంటుంది ఇక్కడి ఆదర్శ విధానాలను తమిళనాడులో అమలు చేస్తామని పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News