Friday, November 15, 2024

మహిళల సంక్షేమంలో తెలంగాణకు తిరుగులేదు

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: మహిళల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దపీట వేస్తున్నారని, మహిళల సంక్షేమంలో తెలంగాణకు తిరుగులేదని బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మ ంగళవారం దుర్గానగర్ ఆర్‌కె గార్డెన్స్‌లో నిర్వహించిన తెలంగాణ మ హిళా సంక్షేమ దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా గర్బిణులకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు అన్నప్రసాన నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఇంటిలో మహిళ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటేనే ఆ కు టుంబం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండగలుగుతుంని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకించి మహిళల కోసమే సుమారు 40సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి, పకడ్బందీగా అమలు చేస్తున్నారని చెప్పారు.

గుక్కెడు మంచినీటి కోసం మైళ్ల దూరం నడిచిన మహిళల కష్టాలను మిషన్ భగీరథతో శాశ్వతంగా తీర్చిదిన విజన్ ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ అని అన్నారు. యావత్ మహిళా లోకం మనసారా ఆశీర్వదించి కెసిఆర్‌ను హ్యాట్రిక్ సిఎంగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, జడ్పిటిసి ఆముల నారాయణ, మున్సిపల్ కమీషనర్ సుమన్ రావు, కార్పొరేటర్లు ధరణి స్వరూప జలపతి, జనగామ కవిత సరోజిని, బాలరాజ్‌కుమా ర్, జంగపల్లి సరోజన, సర్పంచ్ తుంగపిండి సతీష్, రామగుండం సిడిపిఓ పుష్పలత, అధికారులు రజనీ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News