Monday, December 23, 2024

తెలంగాణకు ప్రపంచంతోనే పోటీ: రేవంత్

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు ఇతర రాష్ట్రాలతో పోటీ లేదనీ, ప్రపంచంతోనే పోటీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో సిఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణా ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర వందేళ్ల భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తున్నామన్నారు.

ఇందిరాగాంధీ అప్పట్లో హైదరాబాద్ లో ఐడీపీఎల్ ను ప్రారంభించాలన్న విధానపరమైన నిర్ణయం వల్లనే నేడు రాష్ట్ర రాజధాని ఫార్మారంగంలో మెరుగైన స్థితిలో ఉందన్నారు. హైదరాబాద్ లాంటి నగరం ఎక్కడా లేదనీ, పరిశ్రమలు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని సౌకర్యాలూ కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతం తమ ఫోకస్ అంతా తెలంగాణ అభివృద్ధిపైనేనన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News