Saturday, April 5, 2025

HCU భూముల వివాదం.. విచారణ ఈ నెల 7కు వాయిదా

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్ సియు)కు సంబంధించిన భూముల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో వందల మంది పోలీసుల బందోబస్తు మధ్య అక్కడ జేసీబీలతో చెట్లను తొలగిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ భూముల వ్యవహారంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. హెచ్ సియు కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు కొట్టివేతపై స్టే విధించింది.

ఈ పిటిషన్ పై విచారణ ఏప్రిల్ 7 వరకు వాయిదా వేసిన హైకోర్టు.. అప్పటి వరకు అక్కడ చెట్లు కొట్టివేయవద్దని ప్రభుత్వానికి ఆదేశించింది. అయితే, హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ చెట్లు కొట్టివేత కొనసాగుతుందని పిటీషనర్ తరఫు లాయర్ నిరంజన్ రెడ్డి ఆధారాలు చూపించారు. అలాగే, ఆధారాలు కోర్టుకు సమర్పిస్తున్న విద్యార్థుల మీద కేసులు పెడుతున్నారని కోర్టుకు తెలిపారు. దీంతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News