Saturday, November 23, 2024

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై ముందుకెళ్లొద్దు: హైకోర్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై ముందుకెళ్లొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై కె.ఎ.పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ జరిపింది. మాస్టర్ ప్లాన్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని నిలిపివేశామని వెల్లడించింది. ఈ విషయమై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే పూర్తిగా ఎందుకు రద్దు చేయలేదు అని ప్రశ్నించింది. హైకోర్టు అనుమతి లేకుండా మాస్టర్ ప్లాన్‌పై ముందుకు వెళ్లొద్దని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News