Sunday, December 22, 2024

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఈనెల 20 వరకు విద్యా సంస్థల్లో ఆన్‌లైన్ బోధనతో పాటు ప్రత్యక్ష తరగతులను కొనసాగించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే హైదరాబాద్ నగరంలోని మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని పేర్కొంది. సమ్మక్క జాతరలో కొవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేయాలని స్పష్టం చేసింది. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఎజికి హైకోర్టు తెలిపింది. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంది. ఈ అంశాలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈనేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
నివేదిక సమర్పించిన డిహెచ్:
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని పాజిటివిటీ రేటు 3.40శాతం ఉందని తెలిపారు. జిహెచ్‌ఎంసిలో 4.64 శాతం, మేడ్చల్‌లో 3.76 శాతం పాజిటివిటీ రేటు ఉందని నివేదికలో పేర్కొన్నారు.మొత్తానికి రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గిందని తెలిపారు. అత్యల్పంగా గద్వాలలో 1.45శాతం పాజిటివిటీ రేటు ఉంది. 99 లక్షల ఇళ్లల్లో ఫీవర్ సర్వే చేశారని, కొవిడ్ లక్షణాలు ఉన్న 4.32 లక్షల మందికి మెడికల్ కిట్లు అందించడం జరిగిందన్నారు. పిల్లల చికిత్సకు ఆస్పత్రుల్లో తగిన ఏర్పాట్లు చేశామని, రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయన్నారు. మేడారం జాతరలో కొవిడ్ నిబంధనల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిమని, కరోనా పరీక్షలు, వైద్య శిబిరాలు, అంబులెన్సులు సిద్ధం చేశామని డిహెచ్ హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో వెల్లడించారు. విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశంతోనే పాఠశాలలు తెరిచినట్లు విద్యాశాఖ హైకోర్టుకు తెలిపింది. విద్యాసంస్థల్లో కొవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నట్లు నివేదికలో డిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.

Telangana HC Hearing on Corona Situation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News