Sunday, December 22, 2024

బిజెపి మహాధర్నాకు హైకోర్టు అనుమతి..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై బిజెపి శనివారం ఇందిరాపార్క్ వద్ద చేపట్టే మహాధర్నాకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. ధర్నాలో 500 మంది మాత్రమే పాల్గొనాలని సూచించింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. తొలుత మహాధర్నాకు పోలీసులు నిరాకరించడంతో బిజెపి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం. మహాధర్నాకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.

పేపర్ లీకేజీ వ్యవహారానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు ఇద్దరిని ప్రధాన నిందితులుగా గుర్తించిన పోలీసులు 19 మందిని సాక్షులుగా చేర్చారు. ఓవైపు దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో బిజెపి నిరసనలకు పిలుపునివ్వడంపై రాజకీయంగా చర్చనీయాంశమైంది.

మహాధర్నా ఏర్పాట్లును పరిశీలించిన బిజెపి నేతలు…
మా నౌకర్లు మాగ్గవలే నినాదంతో బిజెపి రాష్ట్ర శాఖ శనివారం చేపట్టే మహాధర్నా ఏర్పాట్లను రాష్ట్ర బిజెపి నేతలు పర్యవేక్షించారు. శుక్రవారం ఇందిరాపార్కు సమీపంలోని ధర్నాచౌక్ పరిసరాలను రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, ప్రదీప్‌ కుమార్, శ్యాంసుందర్‌ గౌడ్, గౌతమ్‌ రావు పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News