Friday, December 27, 2024

షర్మిలా నిరాహార దీక్షకు తెలంగాణ హైకోర్టు ఆమోదం!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిరుద్యోగుల ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టేందుకు వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(వైఎస్‌ఆర్‌టిపి)కి శుక్రవారం తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది. ఏప్రిల్ 17న ‘తెలంగాణ స్టూడెంట్స్ యాక్షన్ ఫర్ వేకెన్సీస్ అండ్ ఎంప్లాయ్‌మెంట్(టిసేవ్) ఇలాంటి నిరాహార దీక్ష చేపట్టాలనుకున్నప్పుడు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

దాంతో హైకోర్టులో షర్మిలా పిటిషన్‌ను దాఖలు చేసింది. నిరసనకు అనుమతించేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోరారు. కాగా నిరాహార దీక్షలో 500 మందికి మించి జనం పాల్గొనరాదని కోర్టు ఆదేశించింది. నిరాహార దీక్షకు 48 గంటల ముందు నిర్వాహకులు పోలీసులను సంప్రదించాలని పేర్కొంది. ఒకటి, రెండు రోజుల్లో షర్మిలా తన నిరసన గురించి ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బూటకపు వాగ్దానాలు, వైఫల్యాలపై గళమెత్తితే దౌర్జన్యంతో అణచివేస్తున్నారన్నారు. నిరాహారదీక్షకు హైదరాబాద్ పోలీసులు అనుమతివ్వకపోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌టిపి అధికార ప్రతినిధి గుట్టు రామచంద్ర రావు కూడా విమర్శలు గుప్పించారు. ‘నిరుద్యోగంపై మేము నిరంతరం పోరాడుతున్నాం. ప్రభుత్వం మమ్మల్ని నోరు మూయించడమే కాదు, నిరసనలు తెలుపుకునే, పోరాడే హక్కును కూడా నిరాకరిస్తోంది’ అన్నారు. ‘ఇదివరలో ఇందిరా పార్క్‌లో కెసిఆర్ నిరసనలు నిర్వహించలేదా?’ అని ప్రశ్నించారు. ‘బిఆర్‌ఎస్‌కు ఒక పద్ధతి, ఇతరులకు మరో పద్ధతి ఎలా ఉండొచ్చు?’ అని రామచంద్ర రావు ప్రశ్నించారు. తమ ప్రతిపాదిత నిరాహార దీక్షలో 39 సామాజిక సంస్థలు, వివిధ రాజకీయ పార్టీలు మద్దతునివ్వనున్నాయని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News