Sunday, February 23, 2025

ఇవాళ ఉ.11 నుంచి సా. 4.30 వరకు ప్రజలు బయటకు రావద్దు…

- Advertisement -
- Advertisement -

నేడు రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ లోనూ తీవ్రమైన వడగాల్పులు వీయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటే అవశాశం ఉందని తెలిపింది. శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ప్రజలు బయటకు వెళ్లవద్దని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News