Thursday, January 9, 2025

ఫార్ములా ఈ కేసు.. కెటిఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతి

- Advertisement -
- Advertisement -

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ ఎసిబి విచారణ ఎదుర్కోనున్నారు. ఈ క్రమంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన లాయర్ సమక్షంలో ఎసిబి అధికారులు విచారణ జరిపేలా కోరుతూ హైకోర్టులో కెటిఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు.తాజాగా కెటిఆర్ పిటిషన్‌కు న్యాయస్థానం అనుమతించింది.

కాగా, రెండు రోజులక్రితం విచారణకు హాజరయ్యేందుకు తన లాయర్ తో కలిసి కెటిఆర్ ఎసిబి కార్యాలయానికి వెళ్లారు. అయితే, అధికారులు లాయర్ ను అనుమతివ్వకపోవడంతో కెటిఆర్.. విచారణకు హాజరుకాకుండానే తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో మరోసారి ఎసిబి కెటిఆర్ కు నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. దీంతో కెటిఆర్ హైకోర్టుకు వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News