Tuesday, January 21, 2025

యువతి అదృశ్యం కేసులో పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

యువతి మిస్సింగ్ కేసులో నిర్లక్ష్యం వహించడంపై నగర పోలీసులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం చేసిన అధికారులకు చురకలు అంటించింది. కేసు విషయంలో సీనియర్ అధికారిని నియమించాలంటూ చెప్పినా సరే నిర్లక్ష్యం వహించడంపై మండిపడింది. కుమార్తె కోసం తండ్రి పడుతున్న ఆవేదన కనిపించడం లేదా? అంటూ పోలీసులను ప్రశ్నించింది. వెంటనే కేసు పరిష్కారానికి సీనియర్ అధికారిని నియమించి యువతి ఆచూకీ కుటుంబసభ్యులకు తెలపాలంటూ మరోసారి ఆదేశాలు జారీ చేసింది. వివరా ల్లోకి వెళితే హైదరాబాద్ పాతబస్తీ మీర్ చౌక్ ప్రాంతానికి చెందిన దిలీప్ ధారకు దీపికా ధార అనే 19సంవత్సరాల కుమార్తె ఉంది. ఆమె బషీర్ బాగ్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 29న అర్ధరాత్రి నుంచి కుమార్తె దీపికా ధార కనిపించక పోవడం పై అతను మీర్ చౌక్ పోలీసులను ఆశ్రయించాడు. తన కూతురిని నాందెడ్ జిల్లా మహారాష్ట్రకు చెందిన షేక్ రెహానా పాషా అనే వ్యక్తి ఎత్తుకెళ్లాడం టూ ఫిర్యాదు చేశారు.

షేక్ పాషా యువతికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడంటూ ఆయన ఫిర్యాదులో తెలిపారు. అలాగే తన కుమార్తె అతని ఖాతాకు తన ఫోన్ నుంచి రూ.12వేలు పంపిందని, బీరువాలో దాచిన రూ.25వేలు కూడా తీసుకెళ్లిందని పేర్కొన్నారు. వెళ్లే సమయంలో ఇంటి మెయిన్ డోర్‌కు సైతం తాళం వేసిందని వెల్లడించారు. ఉదయం లేచి తాము ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదని పోలీసులకు వివరించా రు. ఫిర్యాదు స్వీకరించిన మీర్ చౌక్ పోలీసులు దర్యాప్తు చేస్తామని చెప్పి దిలీప్ ధారను ఇంటికి పంపించారు. అయితే బాధితుడు దిలీప్ ధార తన కుమార్తె కోసం రోజుల తరబడి స్టేషన్ చుట్టూ తిరిగాడు. ఎన్ని రోజులైనా వారి నుంచి ఎటువంటి సమాచారం లేదు. పైగా పోలీసుల నుంచి నిర్ల క్ష్యపు సమాధానాలు వచ్చాయి. దీంతో విసిగిపోయిన బాధితుడు తన కుమార్తె దీపికా ఆచూకీ తెలిపేలా పోలీసులను ఆదేశించాలంటూ హెబియ స్ కార్పస్ రిట్‌తో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ధర్మాసనం కేసు పరిష్కారానికి ఓ ప్రత్యేక సీనియర్ అధి కారిని నియమించాలని నగర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

అయితే హైకోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులు అధికారిని నియమించలేదు. దీనిపై బాధితుడు మళ్లీ పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇదే విషయాన్ని తెలుపుతూ దిలీప్ మళ్లీ హైకోర్టు మెట్లు ఎక్కారు. దీనిపై విచారణ చేసిన ధర్మాసనం పోలీస్ ఉన్నతాధికారులపై సీరియస్ అయ్యింది. కోర్టు చెప్పినా వినరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి నిర్లక్ష్య ధోరణి సరికాదంటూ హెచ్చరించింది. వెంటనే సీనియర్ అధికారిని నియమించి యువతి ఆచూకీ కుటుంబసభ్యులకు తెలపాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News