Saturday, December 21, 2024

డిఎంఇ వాణి నియామకాన్ని రద్దు చేసిన హైకోర్టు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ వైద్య విద్య ఇన్‌చార్జి డైరెక్టర్ గా డాక్టర్ ఎన్.వాణిని ఇటీవల ప్రభుత్వం నియమించింది. ఆమె నియామకాన్ని రాష్ట్ర హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డీఎంఈగా వాణిని నియమించడాన్ని ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపల్ నరేందర్ కుమార్ హైకోర్టులో సవాల్ చేశారు. జూనియర్‌ను ఇన్‌చార్జిగా నియమించారని ఆయన పిటిషన్‌లో వెల్లడించారు. పిటిషనర్ తరపు న్యాయవాది కృష్ణయ్య వాదనలు పరిగణనలోనికి తీసుకున్న ధర్మాసనం ఇన్‌చార్జి ప్రాతిపదికన కాకుండా అదనపు బాధ్యతలు లేదా శాశ్వత ప్రాతిపదికన డీఎంఈ పోస్టు భర్తీ చేయాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News