మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. తనపై నమోదు చేసిన ఏసిబి కేసును కొట్టివేయాలంటూ ఇటీవల కోర్టులో కెటిఆర్ క్వాష్ పిటిషన్ ను దాఖలు చేసిన సంగతి తెలిసింది. కేటీఆర్ పిటిషన్‌పై ఇటీవల వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారానికి తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పు వెల్లడించే వరకు ఆనను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ఈ కేసులో ఏసిబి వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కొద్దిసేపటిక్రితమే కెటిఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో కెటిఆర్ కు సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.
కాగా, నిన్న ఏసిబి విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. కెటిఆర్ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. తన లాయర్ ను ఏసిబి కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో ఆయన విచారణకు హాజరవ్వకుండానే తిరిగి వెళ్లిపోయారు. దీంతో విచారణకు హాజరవ్వాలని మరోసారి ఎసిబి అధికారులు కెటిఆర్ కు నోటీసులు ఇచ్చింది.మరోవైపు, ఇదే కేసులో ఇవాళ ఈడీ విచారణ పిలవగా.. తనకు సమయం కావాలని కెటిఆర్ కోరారు. దీంతో ఆయనకు కొంత సమయం ఇస్తున్నట్లు తెలిపింది. తాజాగా కోర్టు తీర్పుతో మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.