Friday, December 27, 2024

వరంగల్‌లో బిజెపి సభకు హైకోర్టు అనుమతి

- Advertisement -
- Advertisement -

 

Telangana High court

హైదరాబాద్‌:వరంగల్‌లో బిజెపి సభకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సభకు ప్రిన్సిపల్‌ అనుమతి నిరాకరించడంపై బిజెపి హైకోర్టును ఆశ్రయించింది. రేపు(శనివారం) వరంగల్‌ ఆర్ట్స్‌ కాలేజీలో సభ జరగనుంది. హైకోర్టు అనుమతితో బిజెపి సభకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరుకానున్నారు. రేపటితో బండి సంజయ్‌ మూడో విడత పాదయాత్ర ముగియనుంది. ముగింపు సందర్భంగా బిజెపి సభ నిర్వహించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News